dhoni
స్పోర్ట్స్

MS Dhoni: ధోనీకి కోపం వస్తే.. కూజాలు చెంబులవుతాయి..

MS Dhoni:  ధోనీ కూల్ కెప్టెన్. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా కనిపిస్తాడు. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లోనూ ఎలాంటి తొట్రుపాటు కనిపించదు. అలాంటి ధోనీకి కోపం వస్తుందా..? అసలు ధోనీకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? అదీ మన భాగ్యనగరంలో ధోనీకి కోపం వచ్చిన సందర్భంలో అతను తీసుకున్న నిర్ణయం..అతనెంత మొండివాడో తెలియజెప్పే అరుదైన సంఘటన..

భాగ్యనగరంలో ఫేమస్ అంటే తడుముకోకుండా చెప్పేది మన హైదరాబాది బిర్యాని గురించే. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా మన దమ్ బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. అలాగే మన టీమిండియా క్రికెటర్లు సైతం డైట్ ను పక్కన బెట్టి మరీ హైదరాబాద్ బిర్యానీ లాగిస్తుంటారు.

ఇదే బిర్యానీ ధోనీకి కోపం తెచ్చిందంటే నమ్మగలరా..? అప్పట్లో 2014 ఏడాదిలో చాంపియన్స్ లీగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో లీగ్ లో భాగంగా  కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కోసం ..చెన్నై జట్టు మన భాగ్యనగరం చేరుకుంది.

అప్పటి చెన్నై జట్టు స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా, కెప్టెన్ ధోనీ సహా చెన్నై ప్లేయర్లను హైదరాబాదీ అంబటి రాయుడు కలుసుకున్నాడు. ఆ సమయంలో రాయుడితో మంచి బిర్యానీ తినాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతే రాయుడు చకాచకా తన ఇంట్లో   ప్రత్యేకంగా ధమ్  బిర్యాని వండించి  సదరు హోటల్ కు పంపించాడు. బిర్యాని ఆస్వాదించేందుకు రెడీ అయిన చెన్నై టీమ్ ఆశలపై హోటల్ సిబ్బంది నీళ్లు చల్లారు.  యటి ఫుడ్ ను లోపలికి తీసుకువచ్చేందుకు వీలు లేదని హోటల్ సిబ్బంది అతి చేశారు. అప్పటికీ ధోనీ సహా అందరూ కలిసి  కనీసం ప్లేయర్ల రూముల్లోకి బిర్యానీ తీసుకువెళ్లేందుకు అనుమతించాలని కోరినా వారు తిరస్కరించారు.

ఆ హోటల్ లో టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు బస చేసినా..180 రూముల వరకు బుక్ చేసే వారు. అప్పుడు చెన్నై జట్టు కూడా 180 రూములు బుక్ చేసింది. అయినా వారి వినతిని మన్నించకపోవడంతో ప్రశాంతంగా ఉండే ధోనికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. కొన్ని విషయాల్లో ధోనీ చాలా మొండిగా ఉంటాడన్న విషయం ఆ హోటల్ సిబ్బందికి ఆలస్యంగా తెలిసింది. తనకు నచ్చకపోతే ఏమైనా చేసేందుకు రెడీ అయ్యే ధోనీ.. రాత్రికి రాత్రే హోటల్ ఖాళీ చేసాడు. మరో హోటల్ కు మారాడు. అదీ ధోనీ అంటే..

పట్టుదల వస్తే ధోనీ ఎంతవరకైనా వెళతాడు. అందునా ఇంటిలో తయారు చేసి తోటి క్రికెటర్ పంపిన బిర్యానీని తిననీయకుండా ఉంటే ఊరుకుంటాడా..? అంతే అప్పటి నుంచి ఆ హోటల్ లో అప్పటి నుంచి ఆ హోటల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా ఆటగాళ్లు బస చేయడం లేదు. దెబ్బ అదుర్స్ కదా..  కాగా, ఆరోజు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చేతిలో చెన్నై ఓడినా  ఆటగాళ్లకు మాత్రం అద్భుతమైన బిర్యానీ రుచిని ఆస్వాదించిన తృప్తి మిగిలింది.

Also Read: Hardik Pandya: ముంబై ఎక్స్ ఫ్యాక్టర్.. కుంగ్ ఫూ పాండ్యా

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?