తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Konda Surekha: రాష్ట్రంలోని ప్రతీ గుడి ఖర్చులు, ఆదాయ వివరాలను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అన్ని ఆలయాలను ఓకే గొడుగు కిందకు తీసుకొస్తామని వెల్లడించారు. అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదని విమర్శించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశామన్నారు.
టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది… కానీ యాదగిరిగుట్ట బోర్డు కు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని, ఏమి అభ్యంతరం తెలుపబోమన్నారు. వివాదాలు సృష్టించే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్కీయాలజీ ,దేవాదాయశాఖ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: Telangana Weather Alert: 4 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వడగాలులు తప్పవు
కేంద్రం సహకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. నాకు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తామన్నారు. అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజ్ కు ఇస్తామని వెల్లడించారు. దేవాలయాల గోల్డ్ కు సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నామని, ఒక్క వేములవాడ లోనే 60 కేజీల బంగారం ఉందని తెలిపారు.
టీటీడీ దర్శనాల విషయంలో తెలంగాణ దేవాదాయ శాఖ చేసిన సంప్రదింపులు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ఈ నెల 24 నుంచి దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసిందని తెలిపారు. టీటీడీ తాజా ఉత్తర్వులపై ఏపీ సీఎం చంద్రబాబుకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు.
AlsoKCR on Jagadish Reddy: జగదీశ్ రెడ్డి కాస్త జాగ్రత్త.. కేసీఆర్ హెచ్చరిక?