తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ:Mlc Jevan Reddy: బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ ఏకకాలంలో చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు. విడుతలవారీగా మాఫీ చేయడంతో అది కేవలం వడ్డీకే సరిపోయిందని ఎద్దేవాచేశారు. చివరకు రుణమాఫీ చేయకుండా బీఆర్ఎస్ చేతులెత్తేసిందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కానీ రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలనే ఆలోచన చేయడంలేదని ఫైరయ్యారు.
ఎంతసేపు అంబానీ, అదానిలాంటి పెట్టుబడిదారులను ఆదుకోవాలని తప్ప రైతులను ఆదుకునే ఆలోచన కేంద్రానికి లేదని ధ్వజమెత్తారు. ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో గల్ఫ్ కు వెళ్లి బతుకీడుస్తున్నారని, పట్టాదారు పుస్తకం యజమానిపై ఉండటంతో వారి భార్య పేరిట రుణాలు మాఫీ అవ్వలేదని వెల్లడించారు. అది పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కలెక్టర్ కు ఆదేశించి పూర్తిచేయాలని కోరారు.
Also Read: CM Revanth Reddy: నేటి రాజకీయాలపై.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..
ఇదిలాఉండగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోతల బెడద తీవ్రంగా ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కోతుల పునరుత్పత్తి నిలిపేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు చందాలు సేకరించి కోతులు పట్టించి చత్తీస్ గఢ్ కు తరలించి వదిలేస్తున్న పరిస్థితి నెలకొదని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం తప్పా మరో మార్గం లేకపోయిందన్నారు. అందుకే పునరుత్పత్తి నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆరుతడి పంటలు, కూరగాయలు పండించలేమని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Mulugu District News: మిర్చికి మద్దతు ధర ఎక్కడ? బీఆర్ఎస్ నేత డిమాండ్