Tuk Tuk Director Supreet Krishna
ఎంటర్‌టైన్మెంట్

Director Supreet Krishna: గతం, వర్తమానం, భవిష్యత్‌ తెలిసిన కార్‌స్కూటర్.. ‘టుక్ టుక్’ సీక్రెట్ చెప్పేసిన దర్శకుడు

Director Supreet Krishna Interview: ఈ మధ్య ఆడియన్స్‌కు యాక్షన్, లవ్ సినిమాలనే కాకుండా ఫాంటసీ, మ్యాజికల్ అంశాలకు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాంటి మ్యాజికల్, ఫాంటసీ అంశాలతో ఫ్రెష్ కంటెంట్‌‌తో వస్తున్న చిత్రమిదని అంటున్నారు దర్శకుడు సుప్రీత్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో చిత్రవాహిని, ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి నిర్మించిన చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 21న విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు సుప్రీత్ కృష్ణ, మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ఓ క్రికెట్‌ యాడ్‌లో ఉన్న వెహికల్‌ చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. వెహికల్‌కు ప్రాణం ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిన కథే ‘టుక్ టుక్’. ఈ అంశానికి కమర్షియల్‌ ప్యాకేజీని జోడించి కథను రెడీ చేశాను. అసలు పిల్లల దగ్గరికి టుక్‌టుక్‌ ఎలా వచ్చింది? ఈ కార్‌స్కూటర్ వెహికల్‌ వెనుక కథ ఏమిటి అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా చెప్పాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఇందులో బలంగా ఉంటుంది.

Also Read- Chhaava: ‘బలగం’ తర్వాత మళ్లీ ‘ఛావా’కే.. సక్సెస్‌కు కొలమానం ఇదే!

గతంలో వచ్చిన ‘బామ్మ బాట బంగారు బాట నుంచి మెకానిక్‌ మామయ్య, కారు దిద్దిన కాపురం’ వంటి చిత్రాలకు పోలీక ఉంటుందా? అని అంతా అడుగుతున్నారు. ఆ సినిమాల నుంచి ప్రేరణ పొందలేదు. ఇది కంప్లీట్‌ వర్జినల్‌ స్టోరీ. ఇందులో ముగ్గురు టీనేజ్‌ అబ్బాయిలు అవసరం. హర్ష, కార్తికేయ, మధును అడిషన్‌ చేసి సెలక్ట్ చేసుకున్నాను. షూటింగ్‌కు వెళ్లే ముందే వర్క్‌ షాప్స్‌ జరిపాం. అందరికి హై ఇచ్చే సీక్వెన్సెస్ ఇందులో ఉన్నాయి. కథ మొత్తం ‘టుక్‌టుక్‌’ చుట్టే తిరుగుతుంది. వాళ్ల దగ్గరకు ‘టుక్‌ టుక్‌’ ఎందుకొచ్చింది? వాళ్లు ఏం చేశారు? స్ట్రాంగ్‌ ఎమోషన్‌‌తో ఉండే రూటెడ్‌ స్టోరీ, విలేజ్‌ నేపథ్యంలో ఉంటుంది.

చిత్తూరు నేపథ్యంలో 90స్‌లో జరిగే స్టోరీ ఇది. ‘టుక్‌ టుక్‌’ టైటిల్‌ వెనుక కూడా ఓ కథ ఉంది. మొదట ఈ సినిమాకు ‘సౌండ్‌’ అనే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. ఈ సినిమాకు ‘టుక్ టుక్’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. నా నేటివిటి చిత్తూరు నేపథ్యం కావడంతో అది ఈ సినిమాకు ప్లస్‌ అయ్యింది. గతం, వర్తమానం, భవిష్యత్‌ అన్ని తెలిసిన స్కూటర్‌ టుక్ టుక్. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం చెబుతుంటుంది. ట్రైలర్‌లో చూసినట్టుగానే చిన్న హ్యుమర్‌ కోసం ఆ వెహికల్ ఉంటుంది. కానీ ఆ వెహికల్ వెనుక మంచి ఎమోషన్ ఉంటుంది.

Also Read- Nandamuri Kalyan Ram: ప్రాణం పోయడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే స్త్రీమూర్తుల కోసమే ఈ సినిమా..

వెహికల్ కాకుండా ఇందులో ఫాంటసీ మ్యాజికల్‌ పవర్స్‌ ఉన్నాయి. ఇంకా చాలా లేయర్స్‌ ఉన్నాయి. టుక్‌ టుక్‌ వెనుక ఉందేమిటి? దెయ్యమా? దేవుడా? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా బాగా కుదిరాయి. టుక్‌ టుక్‌ ఫ్రాంచైజీని డిజైన్‌ చేసే ఆలోచనలో ఉన్నాను. డిఫరెంట్‌ వెహికల్స్‌తో, డిఫరెంట్‌ బ్యాక్‌స్టోరీతో ఆ ఫ్రాంఛైజీని కొనసాగించాలని చూస్తున్నాను. అది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను.

పూరి జగన్నాథ్‌ దగ్గర రచయితగా చేశాను. ‘అలనాటి సిత్రాలు’ అనే ఒక ఓటీటీ సినిమా చేశాను. దర్శకుడిగా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ మాత్రం ఇదే. ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి తదుపరి సినిమా ఎలా ఉండాలో, ఏ రేంజ్‌లో ఉండాలో.. అనేది ప్లాన్‌ చేసుకుంటాను. తప్పకుండా కొత్త రకమైన కథాంశంతోనే నా సినిమాలు ఉంటాయని మాత్రం చెప్పగలను’’ అని దర్శకుడు సుప్రీత్ కృష్ణ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు