Faf du Plessis: ఐపీఎల్ లో అన్ని జట్లదీ ఒక దారైతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుది మరో దారన్నట్లుగా ఉంటుంది. 17 సీజన్లుగా ఐపీఎల్ కొనసాగుతోంది. ఇంతవరకు ఒకేఒక్కసారి ఢిల్లీ జట్టు ఫైనల్ కు చేరింది. తాజాగా ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌కు జట్టు వైస్ కెప్టెన్ ఎవరో కన్ ఫాం చేసింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది.
డుప్లెసీస్ ఐపీఎల్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు. 136.37 స్ట్రయిక్‌రేట్‌తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది మెగా వేలంలో ఆర్సీబి జట్టు డుప్లెసీస్ ను విడుదల చేయగా.. అతని బేస్ ధర రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
40 ఏండ్ల వయసులోనూ కిరాక్ బాడీ..
భారత క్రికెట్ లో అత్యంత ఫిట్ గా ఉన్న ప్లేయర్ అంటే ఇంకెవరు? కోహ్లీ అనే చెబుతారు. అలాగే సౌతాఫ్రికా క్రికెట్ లోనూ అత్యంత ఫిట్ గా ఉంటే ప్లేయర్ డుప్లెసిస్.. కోహ్లీ లాగానే
ఒంటి నిండా టాటూలతో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంటాడు. లీగ్ క్రికెట్ లో కండ్లు చెదిరే క్యాచ్ లే కాదు.. క్రీజులో అసాధారణ ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా సౌతాఫ్రికా టీ20 టోర్నీతో పాటు ఐపీఎల్‌లోనూ ఆడుతున్నాడు. అతని ఫిట్ నెస్ చూస్తే ఔరా అనిపించకమానదు.. అతని జిమ్ వర్కౌట్స్ వర్కౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్నాయి. ఇందులో స్టన్నింగ్ బాడీతో అతడు మెస్మరైజ్ చేస్తున్నాడు.
కాగా, ఢిల్లీ యాజమాన్యం నూతన కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించకముందు ఈ సీజన్‌లోనే జట్టులో భాగమైన కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ కోసం సంప్రతించినా అతను ఊహూ అన్నాడు. దీంతో అక్షర్ ను కెప్టెన్ గా నియమించారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ..అక్షర్ కు కెప్టెన్ గా అంత అనుభవం లేకపోవడంతో.. గతంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న డుప్లెసిస్ ను డిప్యూటీగా నియమించినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ కు మంచి అనుభవం ఉంది. ఇది అక్షర్ పటేల్ కు ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ పోరాటం మొదలు కానుంది.
ఢిల్లీ జట్టు..
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, , ట్రిస్టన్ స్టబ్స్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి. నటరాజన్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, , మాధవ్ తివారీ, దుష్మంత చమీర, ముకేశ్ కుమార్, విప్రాజ్ నిగమ్, త్రిపురణ విజయ్, సమీర్ రిజ్వీ.
Also Read: Hardik Pandya: ముంబై ఎక్స్ ఫ్యాక్టర్.. కుంగ్ ఫూ పాండ్యా