chandrababu naidu, YS Jagan
Politics

AP News: ఎన్నికల బరిలో రఘురామ! చక్రం తిప్పింది జగనా? చంద్రబాబా?

Raghurama: ఏపీలో రఘురామక్రిష్ణ రాజు కేసు ప్రత్యేకమైనది. వైసీపీ నుంచి గెలిచి చివరిదాకా అదే పార్టీని తిట్టారు. వైసీపీలోకంటే ప్రతిపక్ష శిబిరంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ. వైసీపీకి రాజీనామా చేశాక ఇంకా ఏ పార్టీలో చేరకుండానే తాను కూటమి నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడంటనే ఆ క్లోజ్‌నెస్ అర్థం చేసుకోవచ్చు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి వెళ్లింది. బీజేపీ మాత్రం రఘురామ పేరు ప్రకటించలేదు. రఘురామ బాధతో మాట్లాడుతూ తనకు టికెట్ రాకుండా చేసింది జగనే అని ఆరోపించారు. తెర వెనుక జగన్ చక్రం తిప్పారని చెప్పుకొచ్చారు. దీంతో కూటమి నైతికతపైనే ప్రశ్నలు వచ్చాయి.

జగన్ చెబితే బీజేపీ ఇవ్వకుండా మిన్నకుందా? కూటమిలోనే జగన్‌‌దే పైచేయా? అంటూ విమర్శలు చెలరేగాయి. ఈ చర్చ చంద్రబాబుకు, కూటమికి సవాల్‌గా మారింది. రఘురామ కూడా తొందరపాటు నిర్ణయాలు ప్రకటించకుండా పోటీపై ఆశావహంగానే మాట్లాడారు. హైదరాబాద్‌లో చంద్రబాబుతో మంగళవారం ఆయన భేటీ అయినట్టు తెలిసింది. పోటీపై చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎంపీగా కాకున్నా అసెంబ్లీ బరిలోనైనా రఘురామకు అవకాశం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. రఘురామను టీడీపీలోకి తీసుకుని ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు.

Also Read: టీడీపీకి పవన్ వరం.. బీజేపీ శాపం.. బాబు ఫ్యూచర్ ఏంటో?

దీనితోపాటు మరో చర్చ కూడా జరుగుతున్నది. రఘురామ కోసం చంద్రబాబు నాయుడు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, నర్సాపురం ఎంపీ సీటు తీసుకుని ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది. ఇది ఫలిస్తే రఘురామ మళ్లీ నర్సాపురం నుంచి ఎంపీ బరిలో టీడీపీ అభ్యర్థిగా నిలబడతారు. నర్సాపురం ఎంపీ బరి నుంచి తప్పించడంలో జగన్ చక్రం తిప్పారని అప్పుడు చర్చిస్తే.. ఇప్పుడు చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని చర్చిస్తున్నారు.

Also Read: ఒక వైపు పింఛన్ల పంచాయితీ జరుగుతుంటే.. మరో వైపు వైసీపీ బింకాలు

చంద్రబాబు ప్రయత్నాలు దాదాపుగా సఫలం అయినట్టుగా తెలుస్తున్నది. అందుకే రఘురామ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తాను ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తున్నానని వివరించారు. అయితే.. ఏ పార్టీ నుంచో.. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో తెలియదని రఘురామ అన్నారు. అంటే.. తెర వెనుక ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!