L2 Empuraan: ‘L2 ఎంపురాన్’ మొదటి ఆట ఎన్ని గంటల కంటే!
L2 Empuraan Stills (Image Source: Twitter X)
ఎంటర్‌టైన్‌మెంట్

L2 Empuraan: మార్చి 27న ‘L2 ఎంపురాన్’ మొదటి ఆట ఎన్ని గంటలకు పడుతుందో తెలుసా?

L2 Empuraan: కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా, మరో స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘లూసిఫర్‌’ సీక్వెల్‌ ‘L2 ఎంపురాన్’కు సంబంధించి మేకర్స్ ఓ పవర్ ఫుల్ ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని భాషలలో కూడా ఈ సినిమా ఒకే టైమ్‌కి విడుదలకానుంది. ఆ టైమ్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఈ విషయాన్ని తన ఎక్స్ పోస్ట్‌లో తెలియజేశారు. ఇంతకీ ఈ సినిమా మొదటి ఆట మార్చి 27న ఎన్ని గంటలకు పడుతుందంటే..

Also Read- Ram Charan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఆ శ్వాగ్‌కి ఫిదా కావాల్సిందే!

మార్చి 27న అన్ని భాషలలో ఉదయం 6 గంటలకు ఈ సినిమా విడుదలవుతుంది. ఈ విషయాన్ని టీమ్ ప్రత్యేకంగానూ, అలాగే అధికారికంగానూ ప్రకటించింది. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి తెరపైకి విజృంభించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్ వంటి వారంతా ఇతర పాత్రలలో నటించగా.. ఓనెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటే..
5 అక్టోబర్, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవం అనంతరం సిమ్లా, లేహ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. షూటింగ్‌తో పాటే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

Also Read- Samantha: మళ్లీ సెలైన్.. సమంతకి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఆ తర్వాత ఫిబ్రవరి 9న సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ అందరినీ మెప్పించింది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్ చేస్తూ వదిలిన గ్లింప్స్‌ మంచి స్పందనను రాబట్టుకుంటూనే ఉంది. ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక థియేటర్లలో మోహన తాండవం చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మురళి గోపి కథను అందించగా.. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!