Sambarala Yetigattu: హోలీ సంబరాల్లో మునిగిపోయారు..
Sambarala Yetigattu Movie Still
ఎంటర్‌టైన్‌మెంట్

Sambarala Yetigattu: హోలీ సంబరాల్లో మునిగిపోయారు.. ఇది దేనికి సంకేతం?

Sambarala Yetigattu: యాక్సిడెంట్ తర్వాత మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) చాలా జాగ్రత్తగా సినిమాల కథలను ఎంచుకుంటున్నారు. ఏది పడితే అది చేసేయకుండా, కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఆయన ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. యాక్సిడెంట్‌ టైమ్‌లో చేసిన ‘రిపబ్లిక్’ (Republic) చిత్రం హీరోగా ఆయనని ఒక మెట్టు పైకి ఎక్కించింది. ఆ తర్వాత చేసిన ‘విరూపాక్ష’ (Virupaksha) సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తేజ్‌ని 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చింది. ఇక చినమామ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బ్రో’ (Bro) సినిమాలో నటుడిగా సాయి మరింత క్రేజ్‌ని పెంచుకున్నారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ చేస్తున్న సినిమా ‘సంబరాల యేటిగట్టు’. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read- Robinhood: నితిన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన దర్శకుడు.. కామ్‌‌గా పరుగో పరుగు!

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాతో తన కెరీర్ న్యూ హైట్స్‌కి వెళుతుందని తేజ్ భావిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘హనుమాన్’ (Hanu Man) వంటి బ్లాక్‌బస్టర్‌ని, సంచలనాన్ని ప్రేక్షకులకు అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎటువంటి అంచనాలను పెంచేసిందో తెలియంది కాదు. ముఖ్యంగా సాయి తేజ్ అవతార్, ఇప్పటి వరకు ఆయన కనిపించని విధంగా సరికొత్తగా ఉంది. తాజాగా హోలీ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ దేనికి సంకేతంగా ఉందంటే.. సినిమా సక్సెస్ పక్కా అన్నట్లుగా అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ పోస్టర్‌ని సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన తేజ్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

టీమ్ అందరిలో సాయి దుర్గా తేజ్.. తన టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు తన చేతిని పైకెత్తడం చూడొచ్చు. ఈ సంకేతం నిజంగా టీమ్ అంతా చాలా ఉత్సాహాంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే టీమ్ మొత్తం కూడా రంగుల పండుగలో మునిగిపోయారు. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ట్రీట్ అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఈ ‘సంబరాల యేటిగట్టు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. సాయి దుర్గ తేజ్‌ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలో ప్రమోషన్స్‌ను వెరైటీగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Actor Sivaji: ‘మంగపతి’.. ఏం తాగావ్ బాబూ.. ఏంటా యాక్టింగ్?

Puri Jagan – Charmy: పూరి జగన్ – ఛార్మీల మధ్య ఏం జరిగింది? వారిద్దరూ నిజంగా విడిపోయారా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..