Jack Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Jack: కిస్ సాంగ్ ప్రోమో.. ఒక్కసారి కమిట్ అయ్యానంటే లైఫ్ అంతా ఉండిపోతా!

Jack Kiss Song Promo: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సిద్ధు సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేశాయో తెలియంది కాదు. తాజాగా ఈ చిత్రంలోని మరో సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ‘లవ్ సాంగ్‌’గా రాబోతున్న ఈ పాట ప్రోమోని హోలి స్పెషల్‌గా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో ఏముందంటే..

Also Read- Actor Sivaji: ‘మంగపతి’.. ఏం తాగావ్ బాబూ.. ఏంటా యాక్టింగ్?

‘నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తా’ అని వైష్ణవి అంటే, ‘నువ్వు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో చెబుతున్నా నేను.. ఒక్కసారి కమిట్ అయ్యానంటే లైఫ్ అంతా ఉండిపోతా నేను’ అని సిద్దు బాల్‌ని ఆమె కోర్టులోకే విసిరాడు. ‘ఉండిపో.. ఉండిపోమనే కదా అంటున్నాను.. హా’ అనగానే, ఇంకా ఆలస్యం చేయకుండా సిద్దు ఆమెకు ముద్దు పెట్టబోతాడు. అంతే అతడి నోటిని చేతితో బంధించేసి.. ‘ఇది ఇలా కాదు.. నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి, మనద్దరమే ఉండాలి, ప్రైవేట‌్‌గా ఉండాలి. అంటే, ఫస్ట్ టైమ్ ముద్దు పెట్టుకుంటున్నాం కదా.. గుర్తుండిపోయేలా ఉండాలి’ అని వైష్ణవి ఎంతో ముద్దుగా చెప్పగానే.. ‘అలా లైఫ్ అంతా గుర్తుండిపోవాలంటే.. ఓయో రూమ్‌కి పోయి పోలీసులకు దొరికిపోవాలి ఒకసారి’ అని సిద్దు తనదైన తరహాలో పేల్చిన డైలాగ్. అంతే ‘నీ.. తూ’ అని వైష్ణవి తిడితే.. ‘నీయవ.. ఈ హైదరాబాద్ మొత్తంలో ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ఒక ప్లేస్ లేకపోవడమా.. దా’ అంటూ వైష్ణవిని గుంజుకుంటూ లాక్కెళ్లిపోతున్నాడు. ఇది ఈ వీడియోలో ఉన్న మ్యాటర్.

ఇది చెబుతుంటేనే ఇలా ఉంటే, ఇక ఈ వీడియో చూస్తే.. అస్సలు తట్టుకోలేరు. సిద్ధు, వైష్ణవిల కెమిస్ట్రీ.. ఎంత బాగుందంటే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? టికెట్ కొనుక్కుని ఈ సీన్ కోసం వేచి చూడాలా? అనేంతగా మూడ్‌ని క్యారీ చేస్తుంది. ముఖ్యంగా వైష్ణవిని ఇలా చూసి కుర్రాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం కాస్తంత కష్టమే. ఒకరిని మించి ఒకరు ఉడుకు రక్తాన్ని ప్రదర్శించారు. ఆ వేడికి సిద్ధుకి చెమటలు కూడా పట్టాయి. వైష్ణవి మాత్రం రొమాంటిక్ ఫీల్‌తో నవ్వుతూ.. ఈ సన్నివేశాన్ని నమిలేసింది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత హీరోయిన్‌గా ఆమె రేంజ్ మరింత పెరుగుతుందనడంలో అస్సలు అతిశయోక్తి లేనే లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫుల్ సాంగ్‌ను మార్చి 17న ఉదయం 11 గంటల 07 నిమిషాలకు మేకర్స్ విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారింది.. ఫైనల్‌గా ఆ ఐకానిక్ డేట్ ఫిక్సయింది

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్