Bcci Planned World Champions League Competition In Twenty 20
స్పోర్ట్స్

IPL 2024 : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌

Bcci Planned World Champions League Competition In Twenty 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లోని టాప్ 3 జట్లతో సహా ప్రపంచంలోని ప్రధాన లీగ్‌లలో విజేతగా నిలిచిన జట్ల మధ్య ఛాంపియన్స్ లీగ్ T20 టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్‌ అయితే ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత క్రికెట్ లవర్స్‌ మరో రంగుల టోర్నమెంట్‌ని చూసే ఛాన్స్‌ లభిస్తోంది. ఛాంపియన్స్ లీగ్ టీ20 సీఎల్‌టీ20 టోర్నమెంట్‌ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ తెరవెనుక విశ్వ ప్రయత్నాలు ప్రారంభించింది.

టోర్నమెంట్ చివరిసారిగా 2014లో ప్రపంచ మేజర్ లీగ్‌లలోని ఛాంపియన్స్ జట్ల మధ్య జరిగింది. ఆ తర్వాత బీసీసీఐ ప్రపంచ ఛాంపియన్ జట్లను తిరిగి కలపలేకపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై బీసీసీఐ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా, ఈసీబీ క్రికెట్ బోర్డుతో చర్చించింది. ఈ చర్చలు సఫలమైతే ఈ ఏడాది ఛాంపియన్స్ లీగ్ టోర్నీ నిర్వహించే ఛాన్స్ ఉంది.ఈ ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో ప్రపంచంలోనే అగ్రగామి లీగ్ జట్లు తలపడనున్నాయి. మునుపటి ఎడిషన్లలో, ఐపీఎల్ నుంచి మూడు జట్లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లీగ్ నుంచి రెండు జట్లు, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి టీ20 లీగ్ ఛాంపియన్లు పోటీలో ఉన్నాయి.

Read Also: కోట్లు ఖర్చు పెట్టే ప్లేయర్ కంటే ఆ కుర్రాడే బెటర్

ఇప్పుడు ఫ్రాంచైజీ లీగ్‌లోని ఛాంపియన్ జట్లను మరోసారి ఏకం చేసి ఛాంపియన్స్ టీ20 టోర్నమెంట్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కానీ, ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్ బిజీగా ఉన్నందున, ఈ టోర్నమెంట్‌కు మరింత టైమ్‌ దొరకడం బీసీసీఐకి అతిపెద్ద సవాలుగా మారనుంది. అందువల్ల బీసీసీఐ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించింది. ఈ రెండు క్రికెట్ బోర్డులు తమ జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చినట్లయితే, ఛాంపియన్స్ టీ20 లీగ్‌కు తలుపులు తెరవబడుతాయి. అందువల్ల రానున్న రోజుల్లో ఈ చర్చలు సఫలమైతే నవంబర్, డిసెంబర్ మధ్యలో ఛాంపియన్ జట్ల ఛాంపియన్స్ టీ20 లీగ్ నిర్వహించే ఛాన్స్‌ ఉంది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?