Virat Kohli RCB (Image Source: Twitter X)
స్పోర్ట్స్

RCB – Kohli: ఆర్సీబి కథ మారేనా..? కోహ్లీ ఖాతాలో ఐపీఎల్ ట్రోఫీ చేరేనా..?

RCB – Kohli: ఐపీఎల్‌లో మోస్ట్‌ అన్‌లక్కీ జట్టంటే ..అందరూ చెప్పే పేరు.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు..  పేపర్ పై బలంగా కనిపిస్తుంది..స్టార్ ఫ్లేవర్ కు కొదవ లేదు.. కానీ ప్రతి సీజన్ లోనూ టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరుగుతూనే ఉంటుంది..  అంతర్జాతీయ క్రికెట్ లో సౌతాఫ్రికా టీమ్ ను చోకర్స్ అంటూరు. బహుశా ఐపీఎల్ లో చోకర్స్ అంటే ఆర్సీబి అనాలేమో.. ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు.. ఈ సాలా కప్‌ నమ్‌ దే(ఈసారి కప్‌ మనదే) అంటూ ప్రతీసారి జపించే ఆర్సీబి కలను నిజం చేసుకోలేకపోతోంది.  మరి ఈ 18 వ సీజన్ లోనైనా కల నెరవేరుతుందా..? కోహ్లీ అన్ని టైటిళ్లు దక్కించుకున్నా ఐపీఎల్ టైటిల్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. మరి ఈసారైనా ఐపీఎల్ కప్ అందుతుందో? లేదో? చూడాల్సిందే.

 18 సీజన్లుగా ఒకే జట్టు.. ఒకేఒక్కడు..

ఐపీఎల్ హిస్టరీలో అన్ని సీజన్లలో ఒకే జట్టుకు ఆడిన ప్లేయర్.. ఇప్పటివరకు మరో ఫ్రాంచైజీకి మారని ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. 2008లో 2008 అండర్-19 ప్రపంచ కప్‌ టైటిల్ విజేతగా నిలవడంలో యంగ్ కోహ్లీ దే కీలకపాత్ర.  అప్పట్లో యంగ్  కోహ్లీని ఆర్సీబీ సొంతం చేసుకుంది. యంగ్ కోహ్లీ ..కింగ్ కోహ్లీ అయ్యాడు. ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టీ20 ప్రపంచకప్ ఇలా అన్నీ అందుకున్నాడు. క్రికెట్ లో చాలా రికార్డులు అతని సొంతం. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటివరకు 18 ఏండ్లుగా బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. కానీ టైటిల్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్లేయర్ గా ఆడినా.. కెప్టెన్ గానూ విజేతగా నిలపలేకపోయాడు. కానీ కెప్టెన్‌గా కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించలేకపోయినా .. బ్యాటింగ్ లో మాత్రం దుమ్ము రేపాడు. ఐపీఎల్ కెరీర్ లో 252 మ్యాచ్‌ల్లో 8,004 పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 55 హాఫ్‌ సెంచరీలు కొట్టాడు.  ఇప్పటివరకు  ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసింది కోహ్లీనే కావడం విశేషం. 2013-2021 సీజన్లలో ఆర్సీబీకి నాయకత్వం వహించిన విరాట్ బ్యాటర్ గా రాణించినా టైటిల్ దక్కలేదు. ఇక  2016 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లోనే 973 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ లో అందరి చూపూ ప్రస్తుతం కోహ్లీ మీదనే ఉంది.

కొత్త ప్లేయర్లతో సరికొత్తగా ఆర్సీబీ..

గతంలో క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్ బెంగళూరు జట్టుకు కప్ అందించలేకపోయారు.  మ్యాక్స్ వెల్, కెవిన్ పీటర్సన్ కూడా సాధించలేదు. ప్రస్తుత సీజన్ లోనూ  ఆర్సీబీ ఈసారి కప్ సాధిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. పైగా విరాట్ కోహ్లీ లేకపోతే ఆర్సీబీకి క్రేజ్ అనేదే ఉండదని అందరి భావన. మళ్లీ ఈ సీజన్ లోనూ కోహ్లీపైనే భారమంతా ఉండనుంది.

కొత్తగా జట్టులో చేరిన ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, భువనేశ్వర్ కుమార్ లపై అంచనాలున్నా వీరు ఎలా రాణిస్తారో అన్న కలవరం ఉంది.  అందుకే ప్రతిసారి  సీజన్ ఆరంభానికి ముందు ‘ఈసాలా కప్ నమ్‌దే’ అనే అభిమానులు కూడా ఈసారి సైలెంట్ గా ఉన్నారు.

18 సెంటిమెంట్ వర్కౌటైతే..

కానీ ఒక్కటే ఆశ అందరికీ.. ఇది 18వ సీజన్.. విరాట్ కోహ్లీ నంబర్ 18. మరి తన నంబర్ తో ఉన్న ఏడాదిలో కోహ్లీ చెలరేగితే.. అతనికి తోడుగా మిగిలిన ప్లేయర్లు నిలబడితే కప్ గెలవడం అసాధ్యం కాదు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ తన ఫాం అందిపుచ్చుకున్న కోహ్లీ .. ఐపీఎల్ లో తనదైన స్టైల్ లో మరింతగా రెచ్చిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. తనకు మిగిలిన అసంతృప్తి ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ టైటిల్ ఒక్కటే. అందుకే ఈ సారి కోహ్లీ విడిచిపెట్టే సమస్య లేదంటున్నారు. గతేడాది కేకేఆర్ జట్టు చాంపియన్ గా నిలవడంలో కీరోల్ ప్లే చేసిన విధ్వంసక ఇంగ్లీష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ సీజన్ లో ఆర్సీబికి ఆడనున్నాడు. పవర్ ప్లేలో అతని ధనాధన్ షాట్లతో అందించే అద్భుత ఆరంభాలు ఆర్సీబి రాతను మార్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రాకతో ఆర్సీబి బౌలింగ్ లో పదును పెరిగింది. అతను కొత్త బంతిని అన్ని యాంగిల్స్ లో స్వింగ్ చేయగలడు. అంతేకాదు పవర్ ప్లేలో అతను చాలా డేంజర్ . అతని ఇన్ స్వింగింగ్ డెలివరీలు ఫేస్ చేయడం చాలా కష్టం. ఇక డెత్ ఓవర్లలో అతను పిన్ పాయింట్ యార్కర్లను సంధించడంలో దిట్ట. అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ రాక ఆర్సీబికి కచ్చితంగా మేలు చేస్తుంది. బ్యాటింగ్ లో కోహ్లీపై భారం పడకుండా కెప్టెన్ రజత్ పాటిదార్ చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆర్సీబిని టైటిల్ దిశగా నడిపించాలి. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ షాట్లు ఆడడంలో పటిదార్ ను మించినోల్లు ఉండరు. కాగా, ఆర్సీబి జట్టుకు ఆసీస్ పేసర్ హేజిల్ వుడ్ గాయం పెద్ద దెబ్బగా మారనుంది. గాయంతో అతను బోర్డర్ గవాస్కర్ సిరీస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడలేదు. అతను అందుబాటులోకి ఎప్పుడు వచ్చేది ఇంకా స్పష్టం కాలేదు. ఇక ఆర్సీబి జట్టులో లియామ్ లివింగ్ స్టోన్, కృనాల్ పాండ్యా మిడిల్ లో.. ఫినిషర్ గా టిమ్ డేవిడ్ ఉన్నారు. వీరంతా రాణించడంపైనే ఆర్సీబి కప్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.

హేజిల్ వుడ్ గాయం..

గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.12.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే అతడు వెన్ను గాయంతో  బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే చాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఇక తాజా సీజన లో అతడు ఆడతాడా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆడకపోతే ఆర్సీబీకి ఇది అతిపెద్ద దెబ్బ కానుంది.

ఆర్సీబి తుది జట్టు(అంచనా)

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ , రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్/ లుంగి ఎంగిడి,  సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు