CM Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు (AP CM Chandra Babu) సభను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల సాధికారతకు సంబంధించి ఆయన ప్రసగించారు. ఆడవారికి పురుషులతో సమానంగా హక్కు కల్పించడమే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) సిద్ధాంతమని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ మహిళలపై చిన్న చూపు ఉందన్న ఆయన.. సామాజికంగా వారిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై సెటైర్లు
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao).. మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారని అసెంబ్లీలో (AP Assembly) సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ (Jagan Mohan Reddy) ప్రస్తావన తీసుకొస్తూ సెటైర్లు వేశారు. ఆస్తుల్లో తల్లికీ, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ అసెంబ్లీ కూర్చున్నారని జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. మహిళలకు వాటా ఇవ్వడమనేది కనీస సభ్యత అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రజలకు జావాబుదారీతనంగా ఉండాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు.
Also Read: Madras High Court: జాబ్ కావాలా? ఆ భాష తప్పనిసరి.. హైకోర్టు సంచలన తీర్పు!
అసెంబ్లీలోకి 75 మంది మహిళలు
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలన్నీ మహిళలను ఉద్దేశించినవేనని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తెలుగు దేశం పార్టీకే చెందిందని ఆయన గుర్తుచేశారు. అటు అమరావతి (Capital Amaravati) కోసం రాజధాని మహిళా రైతులు చేసిన కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరామతి ప్రస్తుతం బతికి ఉన్నదంటే అది మహిళలు చూపిన చొరవేనని ఆయన అన్నారు. డీలిమిటేషన్ పూర్తి అయితే 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చంద్రబాబు అన్నారు.