Nithiin: అవును మీరేం తప్పు చదవలేదు. కౌగిలించుకోబోయి అనే బదులు కామించుకోబోయి అని ఏమైనా తప్పుగా పడిందని అనుకుంటున్నారేమో. నిజంగా హీరో నితిన్ అలాగే అన్నాడు. ఈ మాట అన్నది ఎవరిని ఉద్దేశించో తెలుసా? దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) గురించి చెబుతూ నితిన్ ఈ పదం వాడారు. నితిన్ హీరోగా, శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో మరోసారి రూపొందిన చిత్రమిది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, మంగళవారం విడుదలైన ‘అది ధా సర్‌ప్రైజు’ సాంగ్‌పై బీభత్సంగా ట్రోల్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, మార్చి 28న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం, బుధవారం మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘రాబిన్‌హుడ్’ సినిమా మార్చి 28న వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ‘అది దా సర్‌ప్రైజు’ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ వర్డ్ దిల్ రాజు గారిది కాబట్టి ముందుగా ఆయనకు థ్యాంక్స్. జీవి ప్రకాష్ బ్రో చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ వెంకీ, నేను నిన్న (మంగళవారం) రాత్రి ఫుల్ సినిమా చూసుకున్నాం.
Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’
సినిమా చూసుకుని ఒక గంట సేపు ప్రేమించుకుని, కౌగిలించుకుని, ఆల్మోస్ట్ కామించుకోబోయి ఆపుకున్నాం. ఇది నిర్మాత రవిగారికి కూడా తెలియదు. ఈ సినిమా అది, ఇది అని చెప్పాలని ఉంది కానీ, చెప్పను. నా కెరీర్‌లో హ్యుజ్ మూవీ కాబోతుందని బ్లడీ కాన్పిడెంట్‌గా చెప్పగలను. నా బర్త్ డే మార్చి 30. ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఈ సారి నా బర్త్‌డేని ‘రాబిన్‌హుడ్’ టీమ్‌తో, మీడియాతో జరుపుకుంటాను.
ఈ సినిమాకు ప్రాణం ఎంటర్‌టైన్‌మెంట్. అది ‘ఛలో’లో కంటే డబుల్ ‘భీష్మ’లో ఉంటుంది. ‘భీష్మ’కి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు, వెన్నెల కిషోర్.. మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడా ఒక్క అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడా చూడలేదు. ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ వెంకీకి థాంక్యూ. ఈసారి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు అని హరీష్ శంకర్ సినిమాలకు ఉంటుంది.
అలా చెప్పుకుంటే ఈసారి మార్చి 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. వెంకీకి ఇది 3.ఓ. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉంటూ కథ, ఎమోషన్, స్క్రీన్‌ప్లే అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు. మేమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాకు, శ్రీలీలకు ఈ సినిమా ఒక హిట్ కపుల్‌లా నిలబడుతుందనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మైత్రి మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు. మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాతో మరో సక్సెస్ చూడబోతున్నారు. మార్చి 28 థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు. అది మ్యాటర్.
ఇక నితిన్ వ్యాఖ్యలపై, మరీ ముఖ్యంగా ఆ పదంపై అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. అసలే ‘అది ధా సర్‌ప్రైజు’ పాటలోని స్టెప్‌పై ట్రోల్స్ నడుస్తుంటే, మళ్లీ నితిన్ మరింత పని కల్పించాడు. మరీ ఇలా చెడిపోయారేంటో అనేలా నితిన్‌ను అప్పుడే నెటిజన్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక
SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!