Air Quality Report: భారత నగరాల్లో విష గాలి.. ప్రజలు ఎక్కువ కాలం బతకలేరట! | Air Quality Report: భారత నగరాల్లో విష గాలి.. ప్రజలు ఎక్కువ కాలం బతకలేరట!
Air Quality Report (Image Source: Google)
జాతీయం

Air Quality Report: భారత నగరాల్లో విష గాలి.. ప్రజలు ఎక్కువ కాలం బతకలేరట!

Air Quality Report: భారత్ లో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు గాలిని విషపూరితంగా మారుస్తున్నాయి. గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు. తద్వారా ఊపిరితిత్తుల సమస్యల బారిన పడుతున్నారు. దేశంలోని ఏ ప్రధాన నగరం తీసుకున్నా ప్రస్తుతం ఇదే పరిస్థితి ప్రతిబింబిస్తోంది. ఆయా నగరాల్లో గాలి నాణ్యత నానాటికి పతనమవుతున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన మరో రిపోర్టు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ (IQAir).. ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. ‘ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ (The World Air Quality Report 2024) పేరిట దానిని విడుదల చేసింది. 2024లో ప్రపంచంలోని టాప్ – 20 కాలుష్య నగరాల్లో ఒక్క భారత్ నుంచే 13 ఉండటం ప్రస్తుతం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. 2023లో రిపోర్ట్ లో భారత్ నుంచి కేవలం 6 సిటీలు మాత్రమే ఉండటం గమనార్హం. దీన్ని బట్టి దేశంలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అటు ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచినట్లు ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది.

‘ఐక్యూ ఎయిర్’ పొల్యూషన్ నివేదిక ప్రకారం భారత్ లో అత్యంత కాలుష్య కారక నగరంగా అసోంలోని బైర్నిహత్ నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నట్లు సదరు నివేదిక తెలిపింది. రాజధానుల పరంగా చూసుకుంటే గాలి కాలుష్యం విషయంలో ఢిల్లీ టాప్ లో ఉందని చెప్పవచ్చు. అలాగే ముల్లాన్ పుర్, ఫరిదాబాద్, లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నొయిడా, భివాడి, ముజాఫర్ నగర్, హనుమాన్ ఘర్ తదితర నగరాలను కాలుష్య సిటీలుగా వరల్డ్ రిపోర్టు గుర్తించింది. నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల దేశ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నివేదిక హెచ్చరించింది. ప్రజల ఆయుర్దాయం 5.2 సంవత్సరాల మేర తగ్గనున్నట్లు అంచనా వేసింది.

Also Read: Star Comedian: అతని బయోపిక్ చేయాలని ఉందంటోన్న స్టార్ కమెడియన్!

గతేడాది లాన్సెంట్ ప్లానేటరి హెల్త్ స్టడీ (Lancet Planetary Health study) ప్రచురించిన అధ్యయనం ప్రకారం భారత్ లో ప్రతీ ఏడాది 15 లక్షల మంది వాయు కాలుష్య కారణంగా మరణించారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (Soumya Swaminathan) సైతం భారత్ లో క్రమంగా పెరుగుతున్న గాలి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాలి నాణ్యత పెంచే దిశగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

Just In

01

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు