rohith
స్పోర్ట్స్

ICC Champions: ‘ఛాంపియన్స్ లా ఆడాం.. ఛాంపియన్స్ అయ్యాం’

ICC Champions:  మన జట్టుకు ఇవిఎంత మహత్తర క్షణాలు.. వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్.. ఎంతటి సంతోషకరమైన సంఘటన.. 12 ఏండ్ల తర్వాత మనం చాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచాం. చాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా బాగుంది. టీమ్ సెలక్షన్ అదిరింది. తుది పదకొండు ఎంపిక కుదిరింది. మైదానంలో వ్యూహాలు అదరగొట్టాయి. ఇక కెప్టెన్ రోహిత్(Rohith) జట్టును అద్భుతంగా నడిపించాడు. మన టీమ్ లో ప్రతి ఒక్కరూ రాణించారు.

వారికి అప్పగించిన ప్రతి బాధ్యతనూ తూచా తప్పకుండా ..ఎలాంటి గందరగోళం లేకుండా పాటించడమే కాదు.. ఎలాంటి సమయంలో ఎలా ఆడాలో అలా ఎలాంటి లోపం లేని ఆటతీరుతో ఆడారు.

ఫైనల్ కు ముందుగా ఏవో కొన్ని సెంటిమెంట్ల పేరిట సోషల్ మీడియాలో ఎన్నో థియరీలు చక్కర్లు కొట్టాయి. సండే రోజున ఫైనల్ ఆడితే భారత్ గెలవదు.. అసలు న్యూజిలాండ్ తో అయితే మరీ గెలవదు.. మనం ఇప్పటికే రెండు ఫైనల్స్  న్యూజిలాండ్ చేతిలో డబ్ల్యూటీసి ఫైనల్.. 2000 ఏడాదిలో చాంపియన్స్ ట్రోఫీ  ఓడిపోయాం.. ఇక్కడా మనకు గెలపు దక్కదు అని ట్వీట్లు.. సోషల్ మీడియాలో మీమ్స్ .. అంతా రచ్చరచ్చ చేసారు..

5గురు స్పిన్నర్లను ఎంపిక చేస్తారా..? ఇదేం జట్టు అన్న విమర్శలు.. ఫాంలో లేని విరాట్, రోహిత్ ఎందుకంటూ విమర్శలు.. వీరిద్దరితో పాటు జడేజా కూడా రిటైర్ అవ్వాలంటూ సలహాలు.. ఇవన్నీ మనోళ్లు ఆడడం ప్రారంభించాక ఒక్కో మ్యాచ్ గెలుస్తూ వచ్చాక..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించాక .. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడడం.. మన మిడిలార్డర్ చెలరేగడం.. మన స్పిన్నర్లు వికెట్లు తీయడం.. రోహిత్ అద్భుత ఆరంభాలు.. మిడిల్ లో శ్రేయస్ నిలకడ.. అక్షర్ సూపర్ బ్యాటింగ్.. పాండ్యా, రాహుల్ ఫినిషింగ్ టచ్.. చివరలో జడేజా కొసమెరుపులు.. అవుటాఫ్ సిలబస్ గా వచ్చిన వరుణ్ చక్రవర్తి అన్ని జట్లనూ భయపెట్టిన తీరు.. షమీ ఇంపార్టెంట్ వికెట్లు పడగొట్టిన విధానం.. విరాట్ కోహ్లీ  రెండు కీ ఇన్నింగ్స్.. పైనల్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అలరించిన రోహిత్.. చివరగా చాంపియన్స్ గా విజయం సాధించడం..


ఈ విజయంతో మనం సెమీస్ లో ఓడిపోతున్నాం..  లేదంటే ఫైనల్లో విఫలమౌతున్నాం.. అనుకునే లోపు..ఏడాది లోపులోనే రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాం.. 2024 టీ20 ప్రపంచకప్(T20 world Cup), తాజాగా చాంపియన్స్ ట్రోఫీ..ఈ టోర్నీకి ఫేవరెట్ లుగా ఎంటరయ్యాం.. ఎలాంటి హికప్స్ లేకుండా .. పూర్తిగా అన్ని జట్లనూ డామినేట్ చేస్తూ.. ప్రతి మ్యాచ్ గెలిచాం.. లీగ్ దశలోనూ..ఫైనల్లోనూ న్యూజిలాండ్ ను ఓడించాం..మనకు అడ్డంకిగా ప్రతిదశలో నిలిచే ఆసీస్ ను సెమీస్ లో మట్టిగరిపించాం.. మొదట బ్యాటింగ్ చేసినా.. సెకండ్ బ్యాటింగ్ చేసినా మనమే గెలిచాం.. టాస్ అనేది మనకు ప్రాధాన్యం కాదని చూపించాం.. భారత విజయాల్లో సైలెంట్ హీరో శ్రేయస్ అయితే.. కనిపించని హీరో పాండ్యా.. ఇలా చాంపియన్స్ ట్రోఫీలో మనం గెలిచాం.. చాంపియన్స్ గా నిలిచాం.

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం