Ram Gopal Varma: విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘శారీ’. ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది ట్యాగ్‌లైన్. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవి ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొంది మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించారు. పలు యదార్థ ఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో చిత్ర టీమ్ సంభాషించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానమిచ్చారు.
Also Read- Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్
మీకున్న ధైర్యం, భయం లేకపోవడం వంటి అంశాలు నాకు ఎంతో ఇష్టం. ఒకసారి నన్ను హగ్ చేసుకోనిస్తారా? అని ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ‘నేను నీకు హగ్ ఇవ్వను. నేను మగవాళ్లను హగ్ చేసుకునేవాడిలా కనిపిస్తున్నానా?’ అంటూ బదులిచ్చారు వర్మ. మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌తో సినిమా డైరెక్ట్ చేస్తారా? అని అంటే, ‘నేను చచ్చాక ఆయనతో సినిమా డైరెక్ట్ చేస్తాను’ అని అన్నారు. ‘దర్శకుడు సందీప్ వంగా కాంబోలో మీ సినిమా ఆశించవచ్చా?’ అని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు.. ‘అంటే ఏంటి? నేను హీరోగా ఆయన డైరెక్ట్ చేయాలా? లేక, ఆయన హీరోగా నేను డైరెక్ట్ చేయాలా? ఇద్దరం దర్శకులం, అది సాధ్యం కాదు. కాబట్టి సినిమా వుండదు’ అని ఆర్జీవీ జవాబిచ్చారు. వర్మ ఇచ్చిన ఆన్సర్లతో విద్యార్థులంతా క్లాప్స్‌తో మోత మోగించారు.

అనంతరం రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా మీలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్‌ని. నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘శారీ’ సినిమాలో, సోషల్ మీడియా ప్రభావం దాని ద్వారా ప్రమాద భరితంగా మారుతున్న కొన్ని అంశాలను ముఖ్య కథాంశంగా తీసుకోవడం జరిగింది. ముక్కు మొహం తెలియని వాళ్ళతో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌గానీ, ఫోర్‌గ్రౌండ్ గానీ తెలుసుకోకుండా.. గుడ్డిగా నమ్మడం వల్ల జరిగే ఎన్నో ప్రమాదాల గురించి, భయంకర సంఘటనల గురించి చాలా విన్నాం, చూసాం కూడా. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమానే ఈ ‘శారీ’. మార్చి 21న వస్తున్న ఈ సినిమాను మీరంతా చూడాలి’’ అని అన్నారు. ‘నేను కేరళ కుట్టిని. చీరలో తెలుగు అమ్మాయిగా మారిపోయాను. ‘శారీ’ చిత్రంతో నేను తొలిసారిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలను అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు చిత్ర కథానాయిక ఆరాధ్య దేవి.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: నా డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్