Samyuktha: సంయుక్త.. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. హీరోలకు ఆమె లక్కీ హీరోయిన్‌గా మారుతుంది. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ సినిమాలో, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’, నిఖిల్ ‘స్వయంభూ’ సినిమాలలో నటిస్తున్న సంయుక్త, మరోవైపు ఆదిశక్తి అనే ఫౌండేషన్‌ను స్థాపించి మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన ప్రయత్నం చేస్తోంది. అదెలా అనుకుంటున్నారా? లైంగిక వేధింపులపై వినూత్నమైన ప్రయోగంగా దర్శకుడు కె ప్రఫుల్ చంద్ర రూపొందించిన ‘కీప్ ది ఫైర్ అలైవ్’ అనే లఘు చిత్రాన్ని ఆమె సమర్పిస్తోంది. 1 నిమిషం 25 సెకండ్ల ఈ లఘు చిత్రం అందరినీ ఆలోచింపజేసే అద్భుతమైన దృశ్య కావ్యమని, యదార్థ సంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పే విధంగా ఇది ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుత సమాజం తన వైపు చూసి ఆలోచించే కంటెంట్ ఉంది కాబట్టే, అది హీరోయిన్ సంయుక్త ఆకర్షించింది కాబట్టే, ఆమె ఈ లఘు చిత్రాన్ని ప్రజంట్ చేస్తున్నారని టీమ్ చెబుతోంది.
Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?
రేపటి కోసం
ఈ సందర్భంగా రచయిత. దర్శకుడు కె ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ.. నిత్యం మన చుట్టూ జరిగే ఎన్నో విషయాలు మనకు కోపాన్ని తెప్పిస్తుంటాయి. వాటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బాధతో పాటు ఆగ్రహాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిని అధిగమించాలంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా? అంటే కచ్చితంగా కాదు. వీటి కన్నా స్పృహ చాలా ముఖ్యమైనది. మనందరం మనుషులం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకందరికీ తెలుసు. కానీ మారుతున్న కాలంతో పాటు మనం కొన్ని విలువలు మర్చిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నాం. మళ్లీ మనమంతా మనుషులుగా ఒకే తాటిపైకి వస్తే ఎలాంటి అరాచకాలకు తావుండదు. కచ్చితంగా రేపటి కోసం ప్రతి ఒక్కరం ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మార్పు మొదలవుతుంది.

ప్రతి పదం ఒక అగ్ని కణం
భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని 1743లో మొదట కోరిన వ్యక్తి, 1947లో దానిని ఆస్వాదించలేదు కానీ ఆయన ఆశయం నెరవేరింది. అలాగే సమాజంలో మార్పు కోసం ఈరోజు అంతా ఒక అడుగు వేయాలి. ఆ మార్పు ఫలాలు భవిష్యత్ తరాలు కచ్చితంగా అనుభవిస్తాయనే పాయింట్‌తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. అండర్ ది సేమ్ స్కై ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రం విషయంలో చరణ్ తేజ్ ఉప్పలపాటి, యష్ ఇద్దరికి కృతజ్ఞతలు తెలపాలి. ముఖ్యంగా చరణ్ తేజ్ ఉప్పలపాటి అందించిన సహకారం మరువలేనిది. ఇలాంటి ఈ గొప్ప ప్రయత్నానికి హీరోయిన్ సంయుక్త తోడవడం అద్భుతం. ఆమె వాయిస్ ఓవర్‌లో ప్రతి పదం ఒక అగ్ని కణంలా ఉంటుందని, ప్రేక్షకుడి హృదయానికి అంటుకుంటుందని చెప్పగలను. స్త్రీల సమస్యపై ప్రతి గొంతు మాట్లాడాలి. మౌనం అనేది సమాధానం కాకూడదు. సమాజంలో ఈ మార్పు తీసుకురావడమే ఈ ‘కీప్ ది ఫైర్ అలైవ్’ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?
Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?