Ananya Panday: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ మాత్రం సాధించలేకపోయింది. ఇక తెలుగులో ‘లైగర్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూసింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన హీరోయిన్‌గా చేసిన ఆ సినిమా తీవ్ర నిరాశనే ఆమెకు మిగిల్చింది. ఈ మధ్య అసలెందుకు ఆ సినిమా చేశానా? అని బాధపడుతున్నట్లుగా కామెంట్స్ చేసిందంటే, ఎంతగా ఆ సినిమా అనన్యను డిజప్పాయింట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేనా? లేనిపోని ట్రోల్స్ కూడా తనపై వచ్చేలా చేసింది. దాంతో భారీగా ఆమె కెరీర్‌కు డ్యామేజ్ జరిగింది. అంతే, ఇక టాలీవుడ్‌కు ఆమె టాటా చెప్పేసింది.
Also Read- Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్
‘లైగర్’ (Liger Heroine) సినిమాలో అనన్య లుక్స్, యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాయి. దీంతో మొదటి సినిమాతోనే అనన్య పాండేకు నెగిటివిటీ ఏర్పడటంతో తెలుగు ఆఫర్లు రావని ఫిక్సయిన ఈ భామ మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగానే ఉంది. గత ఏడాది ‘కంట్రోల్’ చిత్రంతో హిట్‌ని కూడా అందుకుంది. ఈ భామ గ్లామర్ ప్రదర్శనకు బాలీవుడ్ కూడా ఫిదా అవుతుంది. అందుకే నటనతో సంబంధం లేకుండా, ఈ భామకు అవకాశాలు వరిస్తున్నాయి. అందులోనూ కాస్త పలుకుబడి ఉండటంతో, దానిని వాడుతూ బిజీ నటిగానే కొనసాగుతుంది. ఇక ఆమె సినిమాల సంగతి అలా ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం అనన్య సొగసుల ట్రీట్‌కు అంతే ఉండదు. ఎప్పుడు ఏం ఫొటోలు పోస్ట్ చేస్తుందా? వీడియోలు షేర్ చేస్తుందా? అని నెటిజన్లు ఆమె సోషల్ మీడియాలో అకౌంట్స్‌ను తెగ సెర్చ్ చేస్తుంటారు. అలా ఉంటుంది అమ్మడి గ్లామర్ ప్రదర్శన.
టూ పీస్ బికినీలో
తన కోసం నెటిజన్లు వెయిట్ చేస్తున్నారని పోస్ట్ చేస్తుందో, లేదంటే అవకాశాల కోసం కావాలని ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ, కంట్రోల్ తప్పి మరీ హాట్ ఫొజులతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె బికిని ట్రీట్ ఇచ్చేసింది. తన స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లిన ఈ భామ అక్కడ టూ పీస్ బికినీలో రెచ్చిపోయింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, నెటిజన్లకు కావాల్సినంత ట్రీట్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె బికినీ ఫొటోలు ఇన్‌స్టాను హీటెక్కిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ప్రదర్శనకు అంతా షాక్ అవుతున్నారు. అంతలా ఈ ఫొటోలతో ట్రీట్ ఇచ్చేసింది అనన్య. ఇంకా ఆలోచిస్తారెందుకు.. ఫొటోలను పై ఇన్‌స్టా పిక్స్‌ను స్క్రోల్ చేయండి. అనన్య అందాలను ఆస్వాదించండి.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: నా డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్