బ్రాస్ వెల్, మిచెల్ హాఫ్ సెంచరీలు
రాణించిన రచిన్, గ్లెన్ ఫిలిప్స్
సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు
తలో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా, వరుణ్,కుల్దీప్
దుబాయ్ IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తద్వారా భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63: 101బంతులు,3 ఫోర్లు) తో క్రీజులో పాతుకుపోయి కివీస్ కుప్పకూలకంగా కాపాడాడు. ఇక ఆల్ రౌండర్ బ్రాస్ వెల్(53:40బంతులు, 3 ఫోర్లు,2 సిక్సర్లు) అద్భుతంగా ఆడగా.. రచిన్ రవీంద్ర(37:29 బంతులు,4ఫోర్లు,1 సిక్సర్), గ్లెన్ ఫిలిప్స్(34:52బంతులు:2 ఫోర్లు,1 సిక్సర్) రాణించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(15), విలియమ్సన్(11), టామ్ లేథమ్(14), శాంట్నర్(8) పరుగులు సాధించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టగా..భారత్ కు ప్రమాదకరంగా మారిన మిచెల్ వికెట్ ను షమీ పడగొట్టాడు. ఇక మ్యాచ్ లో వరుణ్(Varun), కుల్దీప్ అద్హుత బౌలింగ్ తో న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న కీలక తరుణంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి మ్యాచ్ లోకి తీసుకువచ్చారు. తొలి వికెట్ ను వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు.
ఈ దశలో మిచెల్, లాథమ్ క్రీజ్‌లో నిలకడగా ఆడుతున్న సమయంలో .. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకుని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ గా వెనక్కి పంపాడు.
Innings Break!
Clinical bowling effort from #TeamIndia bowlers as they restrict New Zealand to a total of 251/7 in the Finals of the Champions Trophy!
Scorecard – https://t.co/OlunXdzr5n #INDvNZ #ChampionsTrophy #Final pic.twitter.com/F4WmHJ4wJR
— BCCI (@BCCI) March 9, 2025
కాగా, ఫైనల్ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ సోసోగా కనిపించింది. భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు జారవిడిచారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్ ఒకసారి, మహ్మద్ షమీ మరోసారి నేలపాలు చేశారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ(Rohith Sharma), శుభ్‌మన్ గిల్(Gill) మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. దీంతో మిచెల్ అర్థసెంచరీతో న్యూజిలాండ్ జట్టు స్కోరు 251 చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ కు కివీస్ జట్టు సూపర్ పేసర్ హెన్రీ గాయంతో దూరం కాగా.. అతని స్ధానంలో నాథన్ స్మిత్(smith) తుది జట్టులోకి వచ్చాడు. ఇక టీమిండియా మాత్రం తన విన్నింగ్ కాంబినేషన్ ను మార్చకుండా అదే జట్టుతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.