IIFA Digital Awards 2025: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విశేషంగా భావించే అవార్డులు కొన్ని ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాకుండా, ఇతర సంస్థలు కొన్ని ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా వేదికలను నిర్వహించి ఇచ్చే అవార్డులు కూడా విశిష్టతను పొందాయి. వాటిలో ఐఫా అవార్డ్స్ కూడా ప్రథమ స్థానంలో నిలుస్తాయి. ఈ 2025 సంవత్సరానికిగానూ ఐపా అవార్డుల వేడుక తాజాగా పింక్ సిటీ జైపూర్‌లో రెండు రోజుల కార్యక్రమంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఐఫా డిజిటల్ అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజైన ఆదివారం సినిమా రంగానికి సంబంధించి అవార్డుల ప్రజంటేషన్ జరగనుంది. ఇక శనివారం రాత్రి జరిగిన డిజిటల్ అవార్డుల వేడుకకు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఎందరో హాజరై, ఇలాంటి అవార్డుల వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి అవార్డులు నటీనటులకు తమ వృత్తి పట్ల మరింత బాధ్యతని, పట్టుదలను పెంచుతాయని చెప్పుకొచ్చారు.
Also Read- Sankranthiki Vasthunam: మరో 300 కొట్టిన వెంకీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్
డిజిటల్ అవార్డుల విషయానికి వస్తే.. ఓటీటీలో విశేష ఆదరణ పొందిన సినిమాలు, సిరీస్‌లకు ఈ పురస్కారాలను అందజేశారు. ఓటీటీలో విడుదలైన ‘దో పత్తి’ సినిమాకు గానూ మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలోనూ, అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ‘12th ఫెయిల్’తో అందరికీ నోటెడ్ అయిన విక్రాంత్ మస్సే ‘సెక్టార్ 36’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఈ అవార్డు వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

ఐఫా డిజిటల్ అవార్డ్స్ 2025 విజేతల వివరాలివే.. (IIFA Digital Awards 2025 Winners List):
ఉత్తమ నటుడు: ‘విక్రాంత్ మస్సే’ (సెక్టార్ 36)
ఉత్తమ నటి: ‘కృతి సనన్’ (దో పత్తి)
ఉత్తమ చిత్రం: ‘అమర్ సింగ్ చంకీలా’
ఉత్తమ దర్శకుడు: ‘ఇంతియాజ్ అలీ’ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: ‘దీపక్’ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: ‘అనుప్రియా గోయెంకా’ (బెర్లిన్)
ఉత్తమ కథ: ‘కనికా థిల్లాన్’ (దో పత్తి)
వెబ్ సిరీస్ విభాగంలో..
ఉత్తమ నటుడు: ‘జితేంద్ర కుమార్’ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ నటి: ‘శ్రేయా చౌదరి’ (బందీశ్ బందిట్స్ సీజన్ 2)
ఉత్తమ వెబ్ సిరీస్: ‘పంచాయత్ సీజన్ 3’
ఉత్తమ దర్శకుడు: ‘దీపక్ కుమార్ మిశ్రా’ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు: ‘ఫైజల్ మాలిక్’ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి: ‘సంజీదా షేక్’ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ కథ: ‘కోటా ఫ్యాక్టరీ సీజన్ 3’
ఉత్తమ రియాల్టీ సిరీస్: ‘ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: ‘యో యో హనీ సింగ్: ఫేమస్’
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: నా డ్యాన్స్‌కు బీజం పడింది అక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్