pune urination
క్రైమ్

Pune: రోడ్డు మీదే మూత్రం పోశాడు… ఇదేంటని అడిగితే ‘దాన్ని’ చూపిస్తూ గెలి చేశాడు

Pune: మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు… అది నిజం. కానీ తాగిన మనిషి తలుచుకుంటే అసలు మాములుగా మనిషి చేయలేనివి కూడా చేయగలడు. అంటే.. జంతువులా మారగలడు. విచక్షణను మరిచి వికృతంగా ప్రవర్తించగలడు. తన శక్తిని మించి ప్రగల్భాలు పలకగలడు. డ్రంక్ డ్రైవ్ టెస్టులో దొరికిన వాళ్లు మాట్లాడే మాటలు ఎలా వుంటాయో ఆ వీడియోల్లో మనం కళ్లారా చూశాం. తాజాగా… తాగాడని రూడీ కాకపోయినా… తాగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఓ వ్యక్తి.. అసభ్యకరమైన పనిచేసి వైరల్(Viral) అయ్యాడు.వీడియో తీస్తున్నప్పుడు తాను దేశవ్యాప్తంగా వైరల్ అవుతానని భయం లేదు కాబట్టి రెచ్చిపోయి… జుగుప్పాకరంగా ప్రవర్తించి, ఇలాంటి పనులే చేసి గతంలో వైరల్ అయిన వారి కంటే ది బెస్ట్ అయ్యేలా వైరలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే… అది పూణే(Pune)లోని శాస్త్రీనగర్. మెయిన్ సెంటర్. అక్కడికి అక్కడికి లగ్జరీ కారైన బీఎండబ్ల్యూ(BMW) వచ్చి ఆగింది. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి కారు దిగి… రోడ్డు మీదే హాయిగా, సిగ్గు పడకుండా, ధైర్యంగా రోడ్డు మీదే మూత్రం పోశాడు. అతను మూత్ర విసర్జన చేస్తుండగా… అటుగా వెళ్తున్న బైకర్… ఈ దారుణాన్ని వీడియో(video) తీశాడు.  పని ముగించిన కారు ఎక్కబోతుండగా అతన్ని నిలదీశాడు.   ‘ఇదేం పని’ అంటూ? అంతే.. అతను చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. ప్యాంటు జిప్ తీసి మర్మాంగం(Genital) చూపిస్తూ ‘పోరా’ అన్నట్లు వెక్కిరించారు. అడుగుతున్నా కూడా అదే పనిగా రెచ్చిపోయాడు. కారులోకి ఎక్కి.. కూడా చూపించాడు. తర్వాత మెరుపు వేగంతో నడుపుకుంటూ వెళ్లిపోయాడు. కానీ అంతకంటే రెట్టింపు వేగంతో వైరలయ్యాడు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు(Filed Case).

ఆ ఇద్దరు యువకుల్ని(Two persons) పోలీసులు(Pune Police) గుర్తించారు. అందులో ఒకతను.. బాగ్యేశ్ ఓస్వాల్(Bhagyesh Oswal)  కాగా పాడుపని చేసిన అతని పేరు… గౌరవ్ అహుజా(Gaurav Ahuja). పేరులో గౌరవ్ ఉన్నా… దాన్ని పొగొట్టుకునేలా ప్రవర్తించాడు. అయితే ప్రస్తుతం పోలీసులు ఓస్వాల్ ను పట్టుకున్నారు. గౌరవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇద్దరు తప్పతాగి(Drunk) ఉన్నట్లుగా అనుమానిస్తున్నందున ఓస్వాల్ ను పూణే పోలీసులు వైద్య పరీక్షలు చేస్తున్నారు.

కాగా, ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతను బీఎండబ్య్లూవాలా అని, అతణ్ని పోలీసులు అరెస్టు చేయ్యరని పెడ్తున్నారు కొందరు. ఇంకొందరు ఫన్నీగా… పాపం అర్జెంటేమో, కిడ్నీ ప్రాబ్లెమ్ ఏమో… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 

Howrah express: రెడ్ క్లాత్ ఊపుతూ రైలుకు ఎదురెళ్లి… వేల ప్రాణాలు కాపాడిన ఏపీ యువకుడు

 

 

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..