Lokesh Revanth
జాతీయం

Nara Lokesh: హిందీ వివాదంపై తెలుగు రాష్ట్రాలు తలో దిక్కు.. సీఎం రేవంత్ అలా.. మంత్రి లోకేష్ ఇలా!

Nara Lokesh: జాతీయ విద్యా విధానంలో కేంద్రం సూచించిన త్రిభాష విధానాన్ని దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రతీ రోజూ కేంద్రంపై విమర్శలు గప్పిస్తున్నారు. త్రిభాషా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దడాన్ని తాము అంగీకరించమని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా త్రిభాష సూత్రంపై తన వైఖరి ఏంటో తెలియజేశారు.

‘హిందీని రుద్దుతుందని అనుకోవట్లేదు’

ఢిల్లీలో జాతీయ మీడియా నిర్వహించిన ఓ కాంక్లేవ్ లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాదిని కుదిపేస్తున్న జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లోని త్రిభాషా సూత్రంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దానిపై లోకేష్ మాట్లాడుతూ కేంద్రం హిందీని బలవంతంగా తమపై రుద్దుతుందని అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరం లోకేష్ స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సులు, హోంకేర్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ప్రతీ రాష్ట్రం ఎంతో ప్రత్యేకమైనదని, తమ తమ మాతృభాషలను ప్రోత్సహించుకునే స్వేచ్ఛ తప్పకుండా ఉండాలని లోకేష్ ఉన్నారు.

డీలిమిటేషన్ పై

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపైనా లోకేశ్ స్పందించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తానూ ఏకీభవిస్తానని చెప్పారు. అదే సమయంలో ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే కూటమిలో భాగస్వామిగా మాట్లాడి తేల్చుకుంటామని ఆయన స్ఫష్టం చేశారు. అయితే పలు రాష్ట్రాలు ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా వాడుకుంటున్నాయని విమర్శించారు.

‘ఏపీ చంద్రబాబు ఉన్నారు’

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల వల్ల ఏపీపై ప్రతీకూల ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కర్ణాటకకు బెంగళూరు.. తమిళనాడుకు చెన్నై.. తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నాడని గర్వంగా చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే పార్టీలో మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూసుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. తనను తాను కార్యకర్తగా భావిస్తున్నట్లు లోకేష్ అన్నారు. సీఎం కుమారుడిగా ఉండంటం చాలా కష్టమని పేర్కొన్నారు.

Also Read: Sakthi Teams: మహిళల రక్షణకు భరోసా.. రాష్ట్రంలో కొత్తగా ‘శక్తి టీమ్స్’

కేంద్రాన్ని తప్పుబట్టిన రేవంత్

అయితే జాతీయ మీడియా నిర్వహించిన ఓ కాంక్లేవ్ లో ఒక రోజు ముందు పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. త్రిభాష విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బలవంతం చేయడం కంటే అది ఒక ఎంపికగా ఉండాలని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హిందీకి పెద్ద పీట వేయడాన్ని తప్పుబట్టిన రేవంత్.. అసలు హిందీ జాతీయ భాషనే కాదని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు రెండో స్థానంలో ఉన్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరి తెలుగు భాష అభ్యున్నతికి ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు.

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే