repostmortem
ఆంధ్రప్రదేశ్

YS Viveka Case: వివేకా హత్య కేసు… రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

YS Viveka Case: YS వివేకా హత్య కేసు(Murder) మరోమారు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆ కేసులో కీలక సాక్షి అయిన వాచ్ మన్ రంగన్న(Ranganna) మృతిచెందిన సంగతి తెలిసిందే. తొలుత అందరూ ఆయనది సహజ మరణమని అనుకున్నారు. కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నరంగన్న.. చనిపోవడంతో ముందు పెద్దగా ఎవ్వరికి అనుమానం రాలేదు. ఆయన రిమ్స్ లోనే చనిపోవడంతో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతం రంగన్న కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారం జరిపి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కానీ, రంగన్న మృతిపై అనుమానాలున్నట్లు(Suspicious Death) మంత్రలు సహా పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేయడం, ఆయన భార్య పులివెందుల పోలీసులకు ఫిర్యాుదు చేయడంతో ప్రభుత్వ సిట్(SIT) ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం (Re -Postmortem) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా…ఈ రోజు ఉదయం కొంత మంది డాక్టర్లతోపాటు ఫోరెన్సిక్ టీమ్ (Forensic team) కడప నుంచి పులివెందులకు చేరుకుంది. పోలీసుల అనుమతితో స్థానిక ఎమ్మార్వో, వీఆర్వో ల ఆధ్వర్యంలో తవ్వకాలు నిర్వహించారు. స్థానిక లయోలా కళాశాల సమీపంలో రంగన్న రీ పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. ఈ రీ పోస్టుమార్టం రిపోర్టులో ఏవైనా కీలక విషయాలు వెలుగులోకి వస్తే..వివేకా కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. కాగా, 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. వివేకా ఇంట్లో సుదీర్ఘ కాలంగా పనిచేసిన రంగన్న హత్య జరిగిన రోజు ఇంట్లోనే ఉన్నాడు. రంగన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ(CBI) కూడా రికార్డు చేసుకుంది.

ఇదిలావుంటే… వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తికాక ముందే ముఖ్య సాక్షులు ఒక్కొక్కరు చనిపోతుండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అందుకే సిట్ ను వేసింది. ఇప్పటివరకు ఆరుగురు సాక్షులు మరణించగా… వారికి అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. కానీ వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాచ్‌మన్‌ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని సర్కారు భావిస్తోంది. అందుకే శుక్రవారం జరిగిన కెబినెట్ సమావేశానికి డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను ప్రత్యేకంగా పిలిచించి, వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని కడప ఎస్పీ తెలిపారు. సాక్షులంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని, ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాల్సి ఉందని అన్నారు.
టీడీపీ నేత బీటెక్ రవి కూడా రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: 

Borugadda:ఫేక్ సర్టిఫికెట్ తో బెయిల్… బోరుగడ్డ కోసం పోలీసుల సెర్చ్

 

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ