Army chief: భారత్ కు దశాబ్దాల కాలంగా శత్రువులుగా పరిగణిస్తున్న దేశాల్లో పాక్, చైనా ముందు వరుసలో ఉంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఆ రెండు దేశాలు ప్రయత్నిస్తుంటాయి. పాక్ ఉగ్రవాదం ఎగదోత ద్వారా సమస్యలు సృష్టిస్తే.. చైనా దురక్రమణ కోసం ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆ రెండు దేశాల గురించి మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలతో యుద్ధం ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.
పాక్ – చైనాతో యుద్ధ ముప్పు: ఆర్మీ చీఫ్
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Chief of Army Staff General Upendra Dwivedi) ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా, పాకిస్థాన్ దేశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్ డొమైన్ లో ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతం బలోపేతంగా ఉందని ఆయన అన్నారు. చైనాలో తయారైన మిలటరీ వస్తువులు, సైనిక సామాగ్రిని పాక్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆ రెండు దేశాల నుంచి భారత్ కు యుద్ధం ముప్పు పొంచి ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పాక్ సరిహద్దుల వెంబడి ఉగ్ర చొరబాటు యత్నాలు నిరంతరాయంగా జరుగుతున్నట్లు ద్వివేది అన్నారు. రానున్న రోజుల్లో ఉగ్రవాదుల కదలికలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కాబట్టి భారత్ మరింత అలెర్ట్ గా ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
’83 శాతం తగ్గిన ఉగ్ర ఘటనలు’
ఉగ్రవాద కట్టడికి భారత్ సైన్యం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంచి ఫలితాలు సాధించినట్లు మీడియాకు తెలియజేశారు. 2018తో పోలిస్తే తీవ్రవాద ఘటనలు 83 శాతం మేర తగ్గినట్లు ఆయన చెప్పారు. 45 మంది మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులైనట్లు చెప్పారు. వారిలో 60శాతం మంది పాక్ సంతతికి చెందిన వారని పేర్కొన్నారు. పాక్ నుంచి ఏ స్థాయిలో ఉగ్రముప్పు భారత్ కు పొంచి ఉందే ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు.
Also Read: Israeli Women Gang Raped: బరితెగించిన మృగాళ్లు.. రూ.100 ఇవ్వలేదని ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్
కలిసి పనిచేద్దామన్న చైనా
ఇదిలా ఉంటే శుక్రవారం భారత్ తో మంచి ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు. ఢిల్లీ – బీజింగ్ పరస్పరం శత్రుత్వం పెంచుకునే కంటే భాగస్వాముల్లా కలిసి పనిచేయడం ఉత్తమమని ఆయన వ్యాఖ్యానించారు. చైనా – భారత్ జట్టుగా ఉండి పరస్పర విజయానికి సహకరించుకోవాలని సూచించారు. ఇరుదేశాలు ఒకరినొకరు నొప్పించుకునే బదులు మద్దతు నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది ఇరుదేశాల ప్రజలకు లాభం చేకూరుస్తుందని అన్నారు. ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాంగ్ యీ అన్నారు.