Swiggy Food Delivery: రైల్వే ప్రయాణికులను ప్రధానంగా వేధించే సమస్యల్లో ఆహారం ఒకటి. గంటలకొద్ది సాగే వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ప్రయాణికుడైనా ఆహారం తప్పని సరి. అయితే రైళ్లల్లో ఉన్న పరిమితుల దృష్ట్యా కొందరు నచ్చిన ఆహారాన్ని తినలేకపోతుంటారు. ఐర్ సీటీసీ అందిస్తున్న ఫుడ్ తోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
100 రైల్వే స్టేషన్లలో స్విగ్గీ సేవలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy).. రైళ్లలో ఆహారాన్ని అందించే సదుపాయాన్ని మరిన్ని స్టేషన్లకు విస్తరించింది. 20 రాష్ట్రాల పరిధిలోని 100 రైల్వే స్టేషన్ల (100 Railway stations)లో స్విగ్గీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్లకు తమ సేవలను విస్తరిస్తారమని ప్రకటించింది. ‘భారత సంస్కృతిలో రైల్వే ప్రయాణం అంతర్భాగం. ప్రయాణం సౌకర్యవంతం కావడంలో ఆహారం తప్పనిసరి. ఇందులో భాగంగానే ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు 100 స్టేషన్లకు సేవలు విస్తరించాం’ అంటూ స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ తెలిపారు.
Also Read: Wife harassment: భార్య వేధింపులకు మరో భర్త బలి.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
2024లోనే ఒప్పందం
రుచికరమైన ఫుడ్ కోసం రైల్వే ప్రయాణికులను పడుతున్న ఇబ్బందులను గమనించిన స్విగ్గీ.. 2024 మార్చిలో రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC)తో ఒప్పందం చేసుకుంది. ఇందుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా స్విగ్గీ సేవలు అందిస్తోంది. అటు జొమాటో సైతం స్విగ్గీ తరహాలోనే ఐఆర్ సీటీసీతో ఒప్పందం చేసుకొని ఫుడ్ ను డెలివరీ చేస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ ను రైల్వే స్టేషన్లకు సమీపంలోని రెస్టారెంట్లలో ఆర్డర్ చేసుకొని రైలులోని ఎంచక్కా ఆరగించవచ్చు.