kishan-reddy
తెలంగాణ

Kishan Reddy: వచ్చేసారి మేమే వస్తాం… ప్రజలు మా వైపే ఉన్నారు

Kishan Reddy: తెలంగాణలో బీజేపీ(Bjp)కి తిరుగులేదని, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Mlc Elections) విజయంతో ఆ విషయం మరోసారి రుజువు అయిందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు ప్రభుత్వానికి, కాంగ్రెస్(Congress) పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు అన్నారు.ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు అనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు గుర్తించారని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని సైతం గెలుచుకోగలిగామని పేర్కొన్నారు. కాగా, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు మల్క కొమురయ్య(Malka Komaraiah), అంజిరెడ్డిని (Anji Reddy)లను గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీని ఓడించాలన్న కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడారని, అందుకు తగిన తీర్పును ప్రజలు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విమర్శలకు తాను స్పందిచనని, విధానపరమైన అంశాల మీదనే స్పందిస్తానని స్పష్టం చేశారు.

Also Read: 

MLC Results: ఎమ్మెల్సీ రిజల్ట్స్… తెలంగాణలో మారిన పొలిటికల్ సినెరియో!

Kiran Kumar Reddy : హరీష్ రావు దుబాయ్ కు వెళ్లిన రోజే కేదార్ మృతి

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!