Kiran Kumar Reddy : టాలీవుడ్ ప్రొడ్యూసర్ శెలగంశెట్టి కేదార్ (Kedar) దుబాయ్ లో చనిపోవడం పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది. ఆయన తన ప్లాట్ లో ఎందుకు చనిపోయాడు అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ కేదార్ అత్యంత సన్నిహితుడు. పైగా బిజినెస్ పార్ట్ నర్ అనే పేరు కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు పెద్ద సంచలనం రేపుతున్నాయి. ‘బీఆర్ ఎస్ ప్రతిదాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఆనీ హరీష్ రావు (Harish Rao) పర్యటన గురించి ఎదుకు బయట పెట్టట్లేదు. ఆయన దుబాయ్ కు వెళ్లిన రోజే కేదార్ చనిపోయాడు. హరీష్ రావుకు శవరాజకీయాలు కొత్త కాదు. కేదార్ మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసును సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలి’ అంటూ కామెంట్స్ చేశారు
హరీష్ రావు బ్లాక్ మనీని దుబాయ్ లో దాచుకున్నారని ఆరోపించారు. బీఆర్ ఎస్ హయాంలో డబ్బులు మొత్తం ఖాళీ చేశారు గానీ.. రాష్ట్ర అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా సరే అక్కడికి కేసీఆర్ అస్సలు వెళ్లలేదన్నారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని.. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే వెంటనే స్పందిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.