Ranya Rao Case
జాతీయం

Ranya Rao Case: రన్యారావు గోల్డ్ కేసులో సంచలన నిజాలు.. నటి వెనక రాజకీయ నేత!

Ranya Rao Case: కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దుబాయి నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారం తరలిస్తూ పట్టుబడ్డ కేసుకు సంబంధించి డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు (DRI) ఇవాళ ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారం ఎవరదని ఆరా తీయగా ఆ గోల్డ్ ను సదరు నేత కొనుగోలు చేసినట్లు DRI అధికారులకు పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

కేజీకి రూ.లక్ష చొప్పున కమీషన్

రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స‍్మగ్లింగ్‌ చేయించినట్లు డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు అనుమానిస్తున్నారు. గోల్డ్‌ను దుబాయ్‌ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోకు రూ. లక్ష రూపాయాల కమీషన్ అందుకునేలా ఆ రాజకీయ నాయకుడితో ఆమెకు ఒప్పందం కుదిరిందని సమాచారం. ఇందులో భాగంగా స్మగ్లింగ్ కోసం గతేదాడి ఆమె 27-30సార్లు దుబాయికి వెళ్లిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఒక్కో ట్రిప్ కు దాదాపు రూ.12 -14 లక్షలు సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సీఎం న్యాయ సలహాదారు స్పందన

రన్యా రావు వెనక ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడంటూ వచ్చిన వార్తలు కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర చర్చను లేవనెత్తాయి. దీంతో ఈ అంశంపై సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న స్పందించారు. నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో అధికారులు, రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని తెలిపారు.

Also Read: Daughter Murder: కసాయి తండ్రి.. మాట వినట్లేదని 5 ఏళ్ల కూతుర్ని ముక్కలుగా నరికి..

4 రోజుల కస్టడీ కోరిన పోలీసులు

గోల్డ్ స్మగ్లింగ్ లో పట్టుబడ్డ రన్యా రావును ఇవాళ డీఆర్ఐ అధికారులు ఎకనామిక్ అఫెన్స్ కోర్టులో హాజరు పరిచారు. ప్రాథమిక దర్యాప్తులో కనుకొన్న విషయాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దుబాయికి వెళ్లిన ప్రతీ ట్రిప్ లో ఆమె ఒకే డ్రెస్ లో వెళ్లారని అందులోనే బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని కోర్టుకు పోలీసులు తెలియజేసినట్లు సమాచారం. జాకెట్ లోపలి భాగంలో కొంత బంగారం, బెల్ట్ రూపంలో కడ్డీలుగా దాచిపెట్టి మరికొంత గోల్డ్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. రన్యారావు స్టెప్ ఫాదర్ సీనియర్ ఐపీఎస్ అధికారి కావడంతో ఆ పలుకుబడి ఉపయోగించుకొని ఎయిర్ పోర్టులో పనిచేసే కానిస్టేబుల్ బసవరాజు సాయాన్ని ఆమె తీసుకుందని డీఆర్ఐ విచారణలో గుర్తించారు. అతడి సాయంతో ఆమె ఎయిర్ పోర్టు భద్రతా వలయాన్ని దాటగలిగినట్లు పోలీసులు కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని విషయాలు కనుగొనేందుకు రన్యా రావును నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరోవైపు రన్యారావు తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించడంతో కస్టడీపై తీర్పును ఎకనామిక్ అఫెన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!