Honour Killing: ఏపీ(AP)లో దారుణం జరిగింది. వేరే కులం(Inter Caste) వాడిని ప్రేమించిందని సొంత తండ్రే(Father) కన్న కూతురి(Daughter)ని కొట్టి చంపి ఆ తర్వాత మృతదేహాన్ని(Dead body) పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ హృదయ విదారకర ఘటన అనంతరం(Anantharpuram) జిల్లా గుంతకల్లు(Guntakal) పరిధిలోని కసాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… గుంతకల్లు పట్టణానికి చెందిన తుపాకుల రామాంజనేయులు అనే వ్యక్తికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూమార్తెల పెళ్లి చేయగా, చిన్న కుమార్తె భారతి బీటెక్ చదువుతోంది. భారతి ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం ఆమె తండ్రికి తెలిసింది. ఆ కుర్రాడు వేరే కులానికి చెందిన వాడు కావడంతో అతను భారతిని మందలించాడు. కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ భారతి… వారి మాటను పెడ చెవిన పెట్టింది. తాను ఆ అబ్బాయినే ప్రేమిస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని తెగెసి చెప్పింది. తాను హెచ్చరించినప్పటికీ కూతురు మాట వినకపోవడంతో రామాంజనేయులు తట్టుకోలేకపోయాడు. కూతరు వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన అతను.. ఆమెను చంపేసి మృతదేహన్ని ఊరి బయట కొండ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనతో కసాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి.
అన్ని విషయాల్లో ఆధునికతను అంగీకరిస్తున్నా మనిషికి ఇప్పటికీ కుల, మత, జాతి విభేదాల పట్ల ఇంకా విద్వేషాలు వీడకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. అదే దేశవ్యాప్తంగా పరువు హత్యలకు దారి తీస్తోంది. కనిపెంచిన వారిని, తోబుట్టువులను కడ తేర్చేందుకు వెనుకాడని ఉన్మాద స్థితికి ఈ భావనే కారణమవుతున్నది. నరనరాల్లో వేళ్లూనుకుపోయిన కుల అహంకారం, మత చాంధసమే ఈ పరువు హత్యలకు, దాడులకు కారణాలు అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ పరువు హత్యలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తున్నది.