bus-accident
జాతీయం

Bus Accident: బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా… 37 మందికి గాయాలు

Bus Accident: ఏంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది తెలుగులో సామెత. వినడానికి కామెడీగా ఉన్నా.. అలాంటి పరిస్థితి తలెత్తితే గానీ తెలియదు ఆ బాధేంటో, అందులో లోతేమిటో. అటువంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది. లాతూర్ జిల్లాలో లాతూర్ నాందేడ్ రహదారిపై అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలస్తోంది. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉందని సమచారం. అహ్మద్ పూర్ డిపోకి చెందిన బస్సు లాతూర్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

లాతూర్ హైవేపై ప్రయాణికులతో  బస్సు వెళ్తోంది. అదే సమయంలో పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు నుంచి వచ్చిన ఓ బైక్ సడెన్ గా హైవే ఎక్కింది. బైక్ నడిపే వ్యక్తి… డివైడర్ దాటి అటువైపుకు వెళ్దామని ప్రయత్నంలో బస్సు వస్తున్నది గమనించలేదు. చివరికి బైక్ రోడ్డు మధ్యలో ఉండటంతో  బస్సు డ్రైవర్ దాన్ని గమనించాడు. అప్పటికే బైక్ కు దగ్గరగా వెళ్లడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దాన్ని ఢీ కొట్టకుండా ఉండేందుకు పక్కకు తప్పించే క్రమంలో దాన్ని కుడి వైపుకి తిప్పాడు. అంతే… బస్సు కంట్రోల్ కాక అదుపు తప్పి బోల్తా పడింది. ఇవతలి వైపున్న బైకర్ భయంతో వాహనాన్ని తిప్పుకొని వెనక్కి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ గా మారాయి.

కాగా, ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 37 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇదిలా వుంటే.. ఈ ప్రమాదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది డ్రైవర్ దే తప్పు అంటుండగా మరికొంత మంది బైకర్ ను నిందిస్తున్నారు. ఏదైమైనా హైవేల మీద రోడ్డు దాటేటప్పడు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలి. ఏమరపాటుగా ఉంటే మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పే. అందునా… బస్సు లాంటివి అయితే… అందులో చాలా మంది ఉంటారు. మహిళలు, పిల్లలు కూడా ఉంటారు. చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి.

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన