MLA Spits Assembly
జాతీయం

MLA Spits Assembly: ఇదేం వికృతం.. అసెంబ్లీలో గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే

MLA Spits Assembly: దేశంలో చట్టసభలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రజాస్వామ్య దేవాలయాలుగా వాటిని అభివర్ణిస్తుంటారు. అటువంటి అసెంబ్లీని ఓ ఎమ్మెల్యే అపవిత్రం చేశాడు. ఏకంగా శాసనసభ ఆవరణలోనే గుట్కా నమిలి ఊశాడు. ఈ వికృత ఘటన ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా జరిగింది. దీనిపై యూపీ స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు పాల్పడిన ఎమ్మెల్యేను తీవ్రంగా హెచ్చరించారు.

గుట్కా మరకలు చూసి షాకైన స్పీకర్

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 9వ రోజు సెషన్ లో పాల్గొనేందుకు స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వచ్చారు. లోపలికి వెళ్తున్న క్రమంలో ఆయనకు కార్పెట్ పై  గుట్కా నమిలి ఉమ్మిన మరకలు కనిపించాయి. దీంతో స్పీకర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే అసెంబ్లీ సిబ్బందిని పిలిపించి నేలపై ఉన్న గుట్కా మరకలను శుభ్రం చేయించారు.

స్పీకర్ చురకలు

అనంతరం సభలోకి ప్రవేశించిన స్పీకర్.. సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. సభను గౌరవప్రదంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. గుట్కా ఊసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్ఛందంగా తన తప్పును ఒప్పుకోవాలని సూచించారు. లేని పక్షంలో సీసీటీవీ ఆధారంగా అతనెవరో గుర్తించి తానే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మివేసిన ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకుండా స్పీకర్ ఈ చురకలు అంటించారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కావద్దని సభ్యులకు సూచించారు.

Also Read: Abandoned Car: కుంభమేళా పార్కింగ్ ఏరియాలో మిస్టరీగా తెలంగాణ కారు

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు