PM Modi: గుజరాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సొంత రాష్ట్రంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ అక్కడి గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. నేడు ప్రపంచ వణ్య ప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఈ జంగిల్ సఫారీ చేయడం విశేషం. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అటవీశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ సఫారీలో పాల్గొని సందడి చేశారు.
సింహాలకు అతి చేరువగా..
గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలో ఈ గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం (Gir Wildlife Sanctuary) ఉంది. ఇవాళ ఉదయం అక్కడకు వెళ్లిన ప్రధాని మోదీ.. జీపులో సఫారీ చేశారు. లయన్స్ తిరిగే ప్రాంతంలో తిరిగారు. వేటగాడి వేషాదరణలో అందర్నీ ఆకట్టుకున్నారు. తలపై హంటింగ్ క్యాప్, వైల్డ్ లైఫ్ జాకెట్ తో వైవిధ్యమైన లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. చేతిలో కెమెరా పట్టుకొని ఓపెన్ టాప్ జీపులో సింహాలను అతి దగ్గర నుంచి ప్రధాని ఫొటోలు తీశారు. అంతేకాదు ఏనుగులకు తన స్వహస్తాలతో చెరుకు గడలు తినిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రధాని మోదీ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Today, on #WorldWildlifeDay, let’s reiterate our commitment to protect and preserve the incredible biodiversity of our planet. Every species plays a vital role—let’s safeguard their future for generations to come!
We also take pride in India’s contributions towards preserving… pic.twitter.com/qtZdJlXskA
— Narendra Modi (@narendramodi) March 3, 2025
ప్రకృతిని కాపాడండి: ప్రధాని
జంగిల్ సఫారీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయో తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నొక్కిచెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
జంతు సంరక్షణపై కీలక భేటి
ఇవాళ మధ్యాహ్నం జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NBWL) కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. గిర్ వన్యప్రాణుల అభయారణ్యం హెడ్ ఆఫీసు అయిన ససన్ గిర్ లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో చీఫ్ ఆర్మీ స్టాఫ్, వివిధ రాష్ట్రాల సభ్యులు, జంతువుల సంరక్షణకు కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ భేటి అనంతరం ససన్ లోని అటవీ సిబ్బందితో ప్రధాని మోదీ కొద్ది సేపు ముచ్చటిస్తారు.
Read Also: Himani Narwal Murder: కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. సొంత వాళ్లే!
సోమనాథ్ ఆలయ సందర్శన
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ప్రముఖ సోమనాథ్ ఆలయాన్న సందర్శించారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లోని జంతు సంకర్షణ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఆపై సాసన్ లోని రాష్ట్ర అటవీశాఖ గెస్ట్ హౌస్ లో రాత్రి ప్రధాని బస చేశారు.
గతంలోనూ సఫారీ చేసిన మోదీ
ప్రధాని మోదీ ఇలా జంగిల్ సఫారీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన కజిరంగ నేషనల్ పార్కులో సఫారీ చేశారు. గతేడాది మార్చిలో ఏనుగుపై ఎక్కి ప్రధాని సఫారీ చేయడం గమనార్హం. అసోంలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మోదీ కజిరంగ పార్కులో పర్యటించారు. ఏనుగుపై సవారి అనంతరం జీపులోనూ సఫారీ చేశారు. ఆ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను తన కెమెరాలో బంధించారు.
PM @narendramodi visits #KazirangaNationalPark in #Assam@kaziranga_ @tourismgoi pic.twitter.com/UAWxIaiQVc
— DD News (@DDNewslive) March 9, 2024