Dilruba Bike Contest: ‘క’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. ఈ సినిమాపై భారీగా అంటే భారీగా ఏం అంచనాలు లేవు కానీ, ఆ అంచనాలను తెప్పించడానికి, రప్పించడానికి టీమ్ బాగానే కష్టపడుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. రెండు మూడు వాయిదాల తర్వాత హోలీ పండుగను పురస్కరించుకుని మార్చి 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ లోపు ఎలాగైనా సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి ఇప్పుడో కాంటెస్ట్‌ని లైన్‌లోకి తెచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా వేదికగా ‘బైక్ కాంటెస్ట్’ అనౌన్స్ చేశారు. ఈ బైక్ సొంతం చేసుకోవాలంటే చేయాల్సింది ఏమిటంటే..
Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ
బైక్ బహుమతిగా పొందాలంటే..
‘దిల్ రూబా’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లోనే స్టోరీ లైన్ దాగి ఉందట. అదేంటో కనిపెట్టి క్రియేటివ్‌గా చెప్పిన వాళ్లకు, ఈ సినిమా కోసమని ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్‌ని బహుమతిగా ఇస్తారట. అది మ్యాటర్. అసలు కిరణ్ అబ్బవరం ఈ వీడియోలో ఏం చెప్పారంటే.. ‘‘నాలోని కోపం, ప్రేమల సమ్మేళనంగా ‘దిల్ రూబా’ సినిమా రూపొందింది. ఈ బైక్ చూశారుగా. ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి ఈ బైక్‌ని తయారు చేశారు. ఇలాంటి బైక్ మార్కెట్‌లో ఎక్కడా మీకు లభించదు. అందుకే దీనిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ బైక్ మీ సొంతం కావాలంటే, మీరు చేయాల్సింది ఏమిటంటే, ఇప్పటి వరకు విడుదలైన ‘దిల్ రూబా’ ప్రమోషనల్ కంటెంట్ చూసి, ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటనేది క్రియేటివ్‌గా చెప్పాలి. ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడాలు ఏమీ లేవు. ఆడవాళ్లు ఈ బైక్ గెలిచి మీ బాయ్ ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ బైక్ గెలిచిన వారికి ప్రీ రిలీజ్ వేడుకలో ఇవ్వడమే కాకుండా, సినిమాకు ఇదే బైక్‌పై ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను’’ అని చెప్పుకొచ్చారు.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025
ప్లాన్ వర్కవుట్ అయిందిగా!
మరెందుకు ఆలస్యం.. ‘దిల్ రూబా’కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌ని తిరగేయండి. స్టోరీ లైన్‌ని క్రియేటివ్‌గా చెప్పేయండి. బైక్ పట్టేయండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. బైక్ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉంది. అది విషయం. మొత్తంగా అయితే ఈ బైక్ రూపంలో ఈ సినిమా అయితే వార్తలలోకి వచ్చేసింది. వారు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయినట్లుగానే భావించవచ్చు. కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకుడు.
ఇది కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!