Vidya Balan: డీప్ ఫేక్.. సెలబ్రిటీలను భయపెడుతున్న టెక్నాలజీ. ఏఐతో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చని ఒక వైపు టెక్నాలజీ డెవలపర్స్ చెబుతుంటే, అదే టెక్నాలజీని బేస్ చేసుకుని కొందరు ఆకతాయిలు చేసే పని, ఎందరికో నిద్ర లేకుండా చేస్తుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ టెక్నాలజీకీ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ టెక్నాలజీతో వచ్చిన వీడియోలలో ఉంది మేము కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తాజాగా విద్యాబాలన్ కూడా డీప్ ఫేక్ బారిన పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియోలను చూసి షాక్ అయిన విద్యా బాలన్.. ఆ వీడియోలకు, తనకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ మెసేజ్‌ని విడుదల చేశారు.
Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ
అంతా అప్రమత్తంగా ఉండాలి
ఈ మెసేజ్‌లో ఆమె ఏమన్నారంటే.. ‘‘సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో నేనే అనిపించేలా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండటం నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ కూడా ఏఐతో చేసిన వీడియోలు మాత్రమే. ఈ వీడియోలను తయారు చేయడంలోగానీ, వైరల్ చేయడంలోగానీ నా ప్రమేయం లేదు. ఆ వీడియోలలో నన్ను చిత్రీకరించిన తీరును కూడా నేను సపోర్ట్ చేయను. నా వీడియోలు ఏవైనా సరే, షేర్ చేసే ముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏఐ టెక్నాలజీతో చేసే ఫేక్ వీడియోలు అందరినీ తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ ఇలాంటి వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.
విద్యాబాలన్ కంటే ముందు ఎందరో..
ఒక్క విద్యాబాలన్ అనే కాదు, ఇంతకు ముందు కూడా ఎందరో హీరోయిన్లు ఈ డీప్ ఫేక్ బారిన పడి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన రష్మికా మందన్నా వీడియో ఆ మధ్య ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ఆమె వీడియోని యావత్ ప్రపంచం ఖండించింది. విద్యాబాలన్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె వంటి వారు ఈ డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డవారిలో ఉన్నారు. వీరు మాత్రమే కాదు, ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అని లేకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఎందరో ఈ డీప్ ఫేక్ బాధితులలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఈ వింత పోకడను సాధ్యమైనంత త్వరగా ఆపాలని వారంతా ఫైట్ చేస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!