MAD Square vs Robinhood: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా, చెప్పిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే విడుదలకాబోతుందని ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 29, శనివారం ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ రోజు అమావాస్య కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధన మేరకు సినిమాను ఒక రోజు ముందుకు ప్రీ పోన్ చేస్తున్నట్లుగా నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. కానీ, అదే రోజు నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో కావాలనే ‘మ్యాడ్ స్క్వేర్’ను ఒక రోజు ముందుకు జరిపారనేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ
అందుకే అనుమానం
కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఎలాంటి పంతాలు, పోటీలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, నిర్మాతల మధ్య లెక్కలు మారాయి. స్నేహపూర్వక వాతావరణంలో కూడా తేడా వచ్చింది. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. ఇప్పుడు కూడా అలాంటి లెక్కలు ఏమైనా ఉన్నాయా? అంటే, అవుననేలా నెటిజన్లు కొందరు సమాధానమిస్తున్నారు. నెటిజన్లే కాదు, ఇండస్ట్రీలోని వారు కూడా ఇదే విషయం చెబుతున్నారంటే, ఈ ఒక్క రోజు ప్రీ పోన్‌లో పెద్ద మ్యాటరే ఉండి ఉంటుందనేలా అనుమానాలు మొదలయ్యాయి.
అందుకేనా పోటీ!
ఎందుకంటే, ఒక సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించే ముందే అన్నీ చూసుకుంటారు. అలాంటిది, ఆరోజు అమావాస్య అని తెలియకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారా? సితార ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలిసిన వారంతా, కావాలనే మైత్రీ మూవీ మేకర్స్ సినిమా అయిన ‘రాబిన్‌హుడ్’ కలెక్షన్లను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. నిర్మాత నాగవంశీ కూడా పంపిణీదారుల అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. మరోవైపు, ఏ నిర్మాత కూడా ఇంకో సినిమాకు పోటీగా వచ్చి, ఆ సినిమా కలెక్షన్లను తగ్గించాలని కోరుకోరని, తద్వారా తన సినిమాకు కూడా లాస్ జరుగుతుంది కదా? అనే వారు కూడా లేకపోలేదు. ఏమో, కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పడం కష్టమే.

మార్చి 28న విడుదలయ్యే ఈ రెండు సినిమాలు పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటే ఓకే, లేదంటే మాత్రం మరోసారి ఇండస్ట్రీపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో? ‘మ్యాడ్ స్క్వేర్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకరే ఈ సీక్వెల్‌ని కూడా తెరకెక్కించారు. నితిన్ ‘రాబిన్‌హుడ్’ విషయానికి వస్తే.. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ఇది కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!