Thandel OTT: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా, నాగ చైతన్య కెరీర్‌లో మొట్టమొదటి రూ. 100 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరిలో ఆఫ్ సీజన్ అయినప్పటికీ, పైరసీ బారిన పడినప్పటికీ ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ (Netflix OTT) సంస్థ డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించింది. మార్చి 7 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ
అందరూ హ్యాపీ
అక్కినేని హీరోలకు చాలా రోజుల తర్వాత పడిన విజయమిది. అలాగే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చిన చిత్రమిది. అందునా, ఎన్నో అవాంతరాలను దాటి ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడం అనేది మాములు విషయం కాదు. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ లాభాలను అందుకున్నట్లుగా ఓ ఈవెంట్‌లో మేకర్స్ తెలిపారు. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ అయినట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు కూడా. ఇలా ఎలా చూసినా, ‘తండేల్’ చిత్రం అందరినీ శాటిస్ ఫై చేసి, గీతా ఆర్ట్స్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను సమర్పించిన అల్లు అరవింద్, మొదటి నుంచి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెబుతూనే వచ్చారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసింది.

వాస్తవ ఘటనతో అల్లిన ప్రేమకథ
వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం, ఇదంతా వాస్తవమే. దీనికే ఒక అందమైన ప్రేమకథను తయారు చేశామని దర్శకుడు చందూ మొండేటి చిత్ర పమోషన్స్‌లో చెబుతూ వచ్చారు. ఆయన అల్లిన ప్రేమకథని ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకోవడంతో పాటు.. నాగ చైతన్య, సాయిపల్లవి వంటి వారు తమ కెరీస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సెట్స్ అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. తద్వారా మంచి విజయానికి కారణమయ్యాయి. మరి థియేటర్లలో అత్యద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!