Economy Employment Support Mgnrega 100 Days Of Work
జాతీయం

Employment Support : ఉపాధికి మరింత ఊతం

– రోజువారీ ఉపాధి కూలీ రూ.300కి పెంపు
– ఏప్రిల్ 1 నుంచి అమలు
– 2005లో రూ.87.50, నేడు రూ.300
– యూపీఏ సర్కారు పథకానికి 19 ఏళ్లు

Economy Employment Support Mgnrega 100 Days Of Work: గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ పథకపు కూలీలకు అందించే దినసరి కూలీ ఏప్రిల్ 1 నుంచి రూ.300కి పెరగనుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు రోజుకు రూ. 272 చెల్లిస్తున్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మరో రూ. 28 కలిపి మొత్తం రూ. 300 అందించనుంది.

దేశంలోని గ్రామాల్లోని నిరుపేదలకు ఏడాదిలో కనీసం 100 రోజులు ఉపాధిని కల్పించటం ద్వారా వారి జీవితాలకు కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2005లో సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఈ పథకానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తొలుత కేవలం కరువు ప్రభావిత జిల్లాలకే పరిమితమైన ఈ పథకాన్ని, 2008 నాటికి దేశమంతా అమల్లోకి తీసుకొచ్చారు. 2005లో రోజుకు రూ. 87.50 కూలీగా అందించగా, 19 ఏళ్ల తర్వాత 2024 ఏప్రిల్1 నాటికి రూ.300 అయింది.

Read Also: రీల్స్‌ చేసిన వ్యక్తికి షాకిచ్చిన పోలీసులు

ఏటా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఏప్రిల్‌ ఒకటవ తేదీన కూలీ పెంచుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో ఎన్నికల కమిషన్ అనుమతితో రోజువారీ కూలీని పెంచుతూ కేంద్రం ప్రకటన చేసింది. పనులకు వచ్చిన వారి వివరాలను న మోదుకు ప్రత్యేకంగా నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) అనే యాప్‌ను రూపొందించారు. పనులు ప్రారంభానికి ముందు వారి ఫొటోను పని ప్రదేశంలోనే సెల్‌ఫోన్‌లో తీసి అందులో ఉదయం 11 గంటల్లోపు అప్‌లోడ్‌ చేసి, పని ముగిశాక ఆయా పని వివరాలను తిరిగి ఫోటోతో పాటు నమోదు చేస్తారు.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..