Dacoit-Still
ఎంటర్‌టైన్మెంట్

Dacoit: అడివి శేష్ ‘డకాయిట్’లో ఆ బాలీవుడ్ దర్శకనటుడు

Dacoit: అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల రకరకాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా స్టన్నింగ్ బ్యూటీ శృతిహాసన్‌ను ఈ సినిమాకు మొదట హీరోయిన్‌గా ప్రకటించారు. కొంతమేర షూటింగ్ అనంతరం ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో ఈ సినిమాపై వార్తలు మాములుగా రాలేదు. అసలెందుకు శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది? అనేలా ఒకటే ప్రశ్నలు. దానికి చిత్రయూనిట్ ఏదో చెప్పుకొచ్చింది తప్పితే.. సరైన రీజన్ మాత్రం చెప్పలేదు. ఆమె ప్లేస్‌లో ఛార్మింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న మరో పాత్రని పరిచయం చేశారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజాయితీ, ధైర్యవంతుడు, అయ్యప్ప భక్తుడైన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయన ఇందులో నటించనున్నారు. చమత్కారం, వ్యంగ్యంతో కూడిన అనురాగ్ కశ్యప్ పాత్ర యాక్షన్, ఎమోషన్, డ్రామాతో అలరించేలా ఉంటుందని తెలుపుతూ, ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని కలగజేస్తుంది. తనకు ద్రోహం చేసిన తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇందులో ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగ అంశాలను చాలా న్యాచురల్‌గా చూపించనున్నారని తెలుస్తోంది.

Anurag Kashyap
Anurag Kashyap

ఇక ఈ సినిమాలో నటించడం పట్ల దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప భక్తుడైన పోలీసు అధికారిగా నటించడం అనేది ఫన్‌తో పాటు సవాలుతో కూడుకున్నది. విధికి వ్యతిరేకంగా ధర్మంతో పాటు తన పనిని హ్యుమర్‌తో చేయడం అద్భుతంగా ఉంది. ఈ పాత్రను రెండు భాషలలో చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. హిందీలో, తెలుగులో షూటింగ్ చేస్తున్నాను. రెండు భాషలలో ఒకే ప్రభావాన్ని చూపడం సవాలుతో కూడుకున్నదే అయినా ఇటువంటి ఛాలెంజెస్ తీసుకుంటేనే నటుడిగా పూర్తిగా ఆనందించగలమని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం, త్వరలోనే మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌ షూట్‌కి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి:
Prabhas: ‘బ్రహ్మ రాక్షస్’.. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేసే సినిమా ఇదేనా!

Sandeep Reddy Vanga: సందీప్ హర్ట్ అయ్యాడురా అబ్బాయిలూ..!

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?