Anasuya: విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద కాపు 1’ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందు, సినిమాపై ఉన్న నమ్మకంతో పార్ట్ 2 కూడా ఉంటుందని ‘పెద కాపు 1’ అని టైటిల్ పెట్టారు. కానీ సినిమా విడుదలై, వచ్చిన రిజల్ట్ తర్వాత మళ్లీ ఎక్కడా ఊసు కూడా లేదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమయ్యారో కూడా తెలియదు. హీరో విరాట్ కర్ణ మాత్రం ప్రముఖ బ్యానర్‌లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. విరాట్ కర్ణ హీరోగా, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది
అక్కమ్మగా పవర్ ఫుల్ పాత్రలో..
ఆ అప్డేట్ ఏమిటంటే.. ఇందులో ఖతర్నాక్ బ్యూటీ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. ఈ విషయం తెలుపుతూ సెట్‌లో అనసూయ ఉన్న ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ.. విడుదల చేసిన అనసూయ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనసూయ రాయల్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక ఆమె ఇందులో నటిస్తుందనే వార్త వచ్చినప్పటి నుండి, ‘పెద కాపు’ బంధం కొనసాగుతుందనేలా వార్తలు మొదలయ్యాయి. ఎందుకంటే, విరాట్ కర్ణ నటించిన ‘పెద కాపు 1’లో అనసూయ అక్కమ్మగా చాలా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. సినిమా కథాంశం మొత్తం ఆ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే హీరో సినిమాలో నటించడానికి అనసూయ ఓకే చేసింది. అనసూయ సాధారణంగా ఏది పడితే అది ఒప్పుకోదు. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే, సినిమా చేస్తుంది. ఆ విషయం ‘రంగస్థలం’, ‘పుష్ప’ సిరీస్ చిత్రాలు చెప్పకనే చెప్పాయి.

భారీగా రెమ్యునరేషన్
‘పెద కాపు 1’ సినిమాలో కూడా అనసూయ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఆ సినిమా సక్సెస్ సాధించలేదు. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే మాత్రం అనసూయకు చాలా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు ‘నాగబంధం’లో ఆమె చేయడానికి ఓకే చెప్పిందంటే కచ్చితంగా ఆమె పాత్రకు మంచి వెయిటేజ్ ఉందనే అనుకోవచ్చు. మరి, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. అన్నట్లు, ఈ సినిమాలోని పాత్ర కోసం అనసూయకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ‘నాగబంధం’ విషయానికి వస్తే, ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను అభిషేక్ నామా రెడీ చేస్తున్నారు. NIK స్టూడియోస్ ఆధ్వర్యంలో కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పకులు. పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశంతో పాటు.. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల ప్రేరణతో, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తంతో ఈ సినిమా వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.