Mad Square Movie Still
ఎంటర్‌టైన్మెంట్

MAD Square: సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తారట!

MAD Square Movie: యూత్ టార్గెట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న చిత్రం ‘మ్యాడ్’ (Mad). ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలై, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు శుక్రవారం హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో..

Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది

నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ వెనక్కి ఇస్తాం

నార్నే నితిన్ మాట్లాడుతూ.. మ్యాడ్-1‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈసారి ‘మ్యాడ్-2’ దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. మరో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. మీరు టీజర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ‘మ్యాడ్’ సినిమా సమయంలో నిర్మాత వంశీ ఒక మాట చెప్పాడు. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెబుతున్నాను. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ వెనక్కి ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్‌లో కలుద్దామని అన్నారు.

Mad Square Press Meet
Mad Square Press Meet

‘మ్యాడ్’కి పది రెట్లు ఉంటుంది

రామ్ నితిన్ మాట్లాడుతూ.. ‘మ్యాడ్’ సినిమా సమయంలో అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నా మొదటి సినిమాకి అటువంటి ఆదరణ వస్తుందని ఊహించలేదు. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే మీడియాకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. నిర్మాత, చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ (Suryadevaa Naga Vamsi) మాట్లాడుతూ.. మంచి సినిమా తీశాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండని అన్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, ‘మ్యాడ్’ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అన్నారు నిర్మాత హారిక సూర్యదేవర. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.

ఇవి కూడా చదవండి:
Prabhas: ‘బ్రహ్మ రాక్షస్’.. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేసే సినిమా ఇదేనా!

Sandeep Reddy Vanga: సందీప్ హర్ట్ అయ్యాడురా అబ్బాయిలూ..!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్