Sankranthiki Vasthunam OTT and TV Premiere: బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, పేరులోనే విక్టరీని పెట్టుకున్న విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ విడుదలపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. డైరెక్ట్ టీవీ ప్రీమియర్‌గా వస్తుందని ఒకసారి, కాదు కాదు, ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అవుతుందనేలా వార్తలు వైరల్ అవుతూ కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో.. మేకర్స్ ఈ కన్ఫ్యూజనకు ఫుల్ క్లారిటీ ఇస్తూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ, టీవీ రిలీజ్ డేట్‌లపై స్పష్టతని ఇచ్చారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో నవ్వులు పంచిన ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అటు ZEE తెలుగు, ఇటు ZEE5లో 2025, మార్చి 1న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కాబోతుందని, కుటుంబ సమేతంగా చూసి అందరూ ఎంజాయ్ చేయండి అంటూ జీ సంస్థ ప్రకటించింది.
Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతున్నట్లుగా మేకర్స్ స్పష్టమైన ప్రకటనతో ఓ పోస్టర్ విడుదల చేశారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా ZEE5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ.. ZEE5, ZEE తెలుగు రెండింటిలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మా ప్రేక్షకులకు అందించబోతున్నాం. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తుంటారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాంటి సినిమాను ఏకకాలంలో ఓటీటీ, టీవీ ప్రీమియర్‌గా మా ఆడియెన్స్‌కు అందిస్తుండటం ఆనందంగా ఉంది. టాలెంటెడ్ దర్శకులు, నటీనటుల బృందంతో కలిసి పనిచేయడం మాకెప్పుడూ అద్భుతమైన అనుభవమే. ప్రస్తుతం ప్రేక్షకులు టీవీ, ఓటీటీ రెండింటిలోనూ ఏకకాలంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. ఓటీటీ, టీవీలో కూడా ఈ సినిమా ఆదిరిస్తారని భావిస్తున్నామని తెలిపారు.
Big laughs, big emotions, and big entertainment 🎬🔥
Watch #SankranthikiVasthunnam Tomorrow 6PM, On #ZeeTelugu & #Zee5 ✨#SankranthiKiVasthunnamOnZeeTelugu#UniversalPremiereSankranthikiVasthunnam @VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo #Dilraju… pic.twitter.com/o78hFeXWSF
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 28, 2025
మరోవైపు ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైన సమయంలో టీమ్ ఎలా ప్రమోట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఏజ్‌తో సంబంధం లేకుండా విక్టరీ వెంకటేష్ యమా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అంతేకాదు, టీమ్‌లోనూ హుషారును నింపారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు.. ఇలా అందరూ ప్రమోషన్లలో పాల్గొని, ప్రతి ఇంటికి ఈ సినిమాను చేరవేశారు. థియేటర్లలో విడుదలకు ముందే ఈ సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకుందంటే, దానికి కారణం మాత్రం టీమ్ చేసిన ప్రమోషన్సే. అప్పుడే కాదు, ఇప్పుడు ఓటీటీ, టీవీలలో వస్తున్న ఈ సినిమాకు కూడా వారు మరోసారి ప్రమోషన్స్‌లోకి దిగడం విశేషం.
