Virat Kohli : ఇండియన్ స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ మరో భారీ రికార్డుకు దగ్గరవుతున్నారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు, పరుగులు చేస్తున్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే. ఒక రకంగా సచిన్ (Sachin) ను కూడా దాటేసే అవకాశాలు ఎక్కువగా మనోడికే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన కింగ్.. ఇప్పుడు మరో భారీ రికార్డు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. న్యూజిలాండ్ మీద 3వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ప్రపంచ బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించేందుకు అతి దగ్గర్లో ఉన్నాడు మన కింగ్.
ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 3345 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 3145 పరుగులతో రెండో స్థానంలో, జాక్వెస్ కల్లిస్ 3071 పరుగులతో మూడో స్థానంలో, జో రూట్ 3068 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 85 రన్స్ చేస్తే న్యూజిలాండ్ మీద 3వేల పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాట్స్ మెన్ గా నిలుస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ తో ఇండియా ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.
85 పరుగులు చేస్తే 3వేల పరుగులు చేసిన ఐదో బ్యాట్స్ మెన్ గా నిలుస్తాడు. ఒకవేళ 106 పరుగులు చేస్తే న్యూజిలాండ్ (New Zealand) మీద అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్ గా నిలుస్తాడు. ఇప్పటి వరకు సచిన్ 1750 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. సచిన్ 42 వన్డేల్లో ఈ పరుగులు చేశాఉడ. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 31 వన్డేలు న్యూజిలాండ్ మీద ఆడి.. 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీలతో 1645 రన్స్ కంప్లీట్ చేశాడు. ఆదివారం గనక 85 పరుగులు చేస్తే సచిన్ రికార్డు బద్దలైపోతుంది.