Suzhal- The Vortex Season 2: సీజన్ 1 సక్సెస్ తర్వాత సీజన్ 2 కోసం వెయిట్ చేయించే వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే ఉంటాయి. వాటిలో ఒకటి ‘సుడల్- ది వర్టెక్స్’. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు సామాజిక సందేశాత్మక అంశాలను, అవగాహనను కల్పించేలా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మంచి ఆదరణను అందించారు. అంతేకాదు, సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుందా? అనే వెయిట్ చేస్తున్నారు కూడా. అలా వెయిట్ చేస్తున్న వారందరికీ ఈ వెబ్ సిరీస్ టీమ్ గుడ్ న్యూస్ తెలిపింది.
Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది
దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ను వాల్ వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయించకుండా, వెంటనే మేకర్స్ అమెజాన్ ఓటీటీలోకి తెచ్చేశారు. అవును, సుడల్ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బ్రహ్మ, సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన సుడల్ సీజన్ 2పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కథిర్, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), గౌరీ కిషన్, సంయుక్త, మోనిషా బ్లెస్సీ, లాల్, శరవణన్, మంజిమా మోహన్, కయల్ చంద్రన్, చాందిని, అశ్విని వంటి వారు ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలను పోషించారు. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో, సీజన్ 2ని గ్రాండ్‌గా నిర్మించారు మేకర్స్.

సామ్ సిఎస్ సంగీతం ఈ సిరీస్‌కు మరో హైలైట్. ఇందులో 9 పాటలు, ఆర్ఆర్ సిరీస్‌ను మరింత ఎలివేట్ చేసేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. టి-సిరీస్ ద్వారా మార్కెట్‌లోకి ఆల్బమ్ వచ్చేసింది. సుడల్ సీజన్ 1 సెటప్, సిరీస్ మేకింగ్, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ వీక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ది వెరైటీ మ్యాగజైన్ ప్రకటించిన 2022 టాప్ 10 బెస్ట్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లలో సుడల్‌కి కూడా చోటు దక్కింది. పుష్కర్, గాయత్రి కథను చెప్పడంలో మాస్టర్స్ పేరును సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ సీజన్ 2తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు వచ్చారు. సస్పెన్స్‌తో పాటుగా, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇచ్చేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం, క్షణం చూపు పక్కకి తిప్పుకోనివ్వని ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌ని వీక్షించేయండి.