tamkajal
క్రైమ్

crypto currency fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం… తమన్నా, కాజల్ లను విచారించనున్న పోలీసులు

crypto currency fraud: సినీ తారలకు వివాదాలకు విడదీయలేని సంబంధం ఉంటుంది. ఇదీ ఎవ్వరైనా అంగీకరించే సత్యం. వాళ్లు ఏం చేసినా సంచలనమే. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మాములుగా సినీ తారలు రకరకాలకు బ్రాండ్లకు ప్రమోటర్లుగా ఉంటుంటారు. అలా ఉండటం వల్ల పెరిగే సెల్స్ సంగతి పక్కన పెడితే.. ఏదైనా తేడా వస్తే మాత్రం సదరు కంపెనీలతో పాటు సమస్య వాళ్ల మేడకు కూడా చుట్టుకుంటుంది. సరిగ్గా అలాంటి కష్టమే వచ్చింది గ్లామర్ క్విన్స్.. తమన్నా (Tamanna), కాజల్ (Kajal Agarwal) లకు. పుదుచ్చేరి (Puducherry)లో జరిగిన ఓ క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి వారిద్దరిని పోలీసులు త్వరలోనే విచారించనున్నారు.

ఏం జరిగిందంటే?

క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక లాభం ఆశ చూపి ఓ కంపెనీ దాదాపు రూ.2.40 కోట్లు మోసానికి పాల్పడింది. ఆ ఫ్రాడ్ పై పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఆ మోసానికి వీరికి లింకేంటి? అంటే… సదరు క్రిప్టో కరెన్సీ కంపెనీని కోయంబత్తూరులో 2022లో ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో తమన్నా, ఇతర ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. అలాగే మహాబలిపురంలో జరిగిన అదే కంపెనీ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ కూడా హాజరైంది.

అలా… వీళ్లతో పబ్లిసిటీ చేసిన తర్వాత ముంబైలో నిర్వహించిన మరో కార్యక్రమంలో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసింది కంపెనీ. బాధితుల నుంచి భారీగా దండుకున్న నిందితులు.. పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని ఆశ కల్పించారు. తర్వాత నట్టేట ముంచారు.

ఎంత నమ్మించారంటే… సంస్థ ప్రారంభించిన మూడు నెలల్లోనే 100 మంది నుంచి రూ.1.10 కోట్లకుపైగా వసూలు చేసినట్లు పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ వెల్లడించారు. సదరు కంపెనీ కస్టమర్లను ఆకర్షించేందుకు తొలుత  లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందని, మరింత మందిని ఆకర్షించడానికి ముంబయిలోని ఒక క్రూయిజ్ షిప్‌లో విలాసవంతమైన పార్టీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు
పేర్కొన్నారు. మొత్తం రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.

అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తమన్నా, కాజల్ లను కూడా విచారించనున్నారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్