Delhi Traffic Police | రీల్స్‌ చేసిన వ్యక్తికి షాకిచ్చిన పోలీసులు
Stopped Car On Flyover For Reel Stunt Arrested
జాతీయం

Delhi Traffic Police: రీల్స్‌ చేసిన వ్యక్తికి షాకిచ్చిన పోలీసులు

Stopped Car On Flyover For Reel Stunt Arrested: చాలామంది రకరకాల ఫీట్లు చేస్తూ లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అదేంటీ రీల్స్ చేస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా అని అనుకుంటున్నారా.. ఆగండీ ఆగండీ… అసలు మ్యాటర్ వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోషల్‌మీడియా రీల్స్ కోసం ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించాడు.

ఢిల్లీ నగరంలోని అత్యంత రద్ధీగా ఉండే ఓ ప్లైఓవర్‌పై కారుని అడ్డంగా ఆపి ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడికి ఏకంగా రూ. 36వేల జరిమానా విధించారు. అంతేకాదు అరెస్ట్ చేసిన పోలీసుల మీద దాడికి దిగాడని తెలిపారు.ఇంతకీ ఈ ఘటనకి పాల్పడిన నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా.

Read Also: ఢిల్లీ సీఎంపై హైకోర్టులో పిటిషన్, ఐరాస భారత్‌కు కీలక సూచన

నిందితుడి కారుని పోలీసులు స్వాధీనం చేసుకొని, అతడిపై మోటారు వెహికిల్‌ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ నగరం పశ్చిమ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ రద్ధీగా ఉన్న టైంలో తన కారుని ఆపి వీడియోలు షూట్ చేశాడని డోరు తెరిచి కారు నడిపాడని పోలీసులు తెలిపారు.అంతటితో ఆగకుండా పోలీసు బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని పోలీసులు వివరించారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేశాడని పోలీసులు వెల్లడించారు.

సదరు నిందితుడు ప్రదీప్‌పై కేసు నమోదు చేయడానికి కారణమైన వీడియోలను ఢిల్లీ పోలీసులు షేర్ చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిని అరెస్ట్ చేశామని వివరించారు. ప్రదీప్ ఉపయోగించిన కారు అతడి తల్లి పేరు మీద రిజిస్టర్ అయినట్లు తేలిందని.. కారులో కొన్ని నకిలీ ప్లాస్టిక్‌ ఆయుధాలను గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గరం గరం అవుతున్నారు. రీల్స్‌ చేయాలంటే ఎక్కడికైనా వెళ్లాలి కానీ..ఇలా నడిరోడ్డు మీద నీ పిచ్చి రీల్స్‌ ఏంటని ఫైర్ అవుతున్నారు. మరికొందరు అయితే వాడికొక తిక్కుంది దానికొక లెక్కుందంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..