Kayadu Lohar
Uncategorized, ఎంటర్‌టైన్మెంట్

Kayadu Lohar : టాలీవుడ్ మరో క్రష్‌గా కొత్త హీరోయిన్

Kayadu Lohar : సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. కొందరు ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోతుంటారు. అయితే యూత్ మనుషులను కొల్లగొట్టి, క్రష్ అనిపించుకునే వాళ్ళు తక్కువే మందే అని చెప్పవచ్చు. అలాంటి వాళ్లలో రష్మిక, త్రిప్తి డిమ్రీ ఉన్నారని చెప్పవచ్చు. నేషనల్‌‌ క్రష్ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో ఆడియెన్స్‌ని ఈ ముద్దుగుమ్మలు ఆకట్టుకుంటున్నారు. కొత్తగా ఇదే దారిలో మరో బ్యూటీ వచ్చేసింది. ఆమె ఎవరో కాదు కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్‌‌ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో కథానాయికగా నటించిన కయాదు లోహర్ యూత్‌ని తన అందం, నటనతో పడేసింది.

గతంలో తెలుగులో ‘అల్లూరి’ అనే మూవీలో కయాదు లోహర్ యాక్ట్ చేసింది. అయితే ఆమెకు ఈ చిత్రం గుర్తింపు తీసుకురాలేదు. ‘డ్రాగన్‌‌’ హిట్ కావడంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది. తన నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌‌లో ఈ భామ చేసిన అల్లరి ఇంత అంత కాదు. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మందిని ఆకర్షించింది. ప్రస్తుతం తమిళంలో ‘ఇదయం మురళి’ అనే మూవీలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ బ్యూటీకి తెలుగులో అవకాశం వచ్చిందని టాక్ నడుస్తోంది. విశ్వక్ సేన్‌‌ హీరోగా నటిస్తున్న ‘ఫంకీ’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు కయాదు లోహర్ సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌’ మూవీలో ఈమె నటనకు ఎంతో మంది డైరెక్టర్స్ ఫిదా అవుతున్నారట. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తాయని అంటున్నారు. మరి తెలుగులో మంచి ఆఫర్లు వచ్చి సక్సెస్ అవుతుందో చూడాలి.

 Kayadu Lohar

 

Also Read: ‘బ్రహ్మ రాక్షస్’.. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేసే సినిమా ఇదేనా!

ఇక ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ రెండో రోజు నుండి టికెట్స్ భారీగా అమ్ముడు పోయాయి. ఇక వీకెండ్ డేస్ లో అయితే.. మంచి కలెక్టన్స్ రాబట్టింది. టాలీవుడ్ లో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.3.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.33 కోట్ల షేర్ రాబడితే చాలు. మరో 2రోజులు ఇలాగే బుకింగ్స్ ఉంటే.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!