Jyothika: సీనియర్ నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. దక్షిణాదిలో దాదాపు అందరు హీరోలతో జ్యోతిక నటించింది. ఈమె నటించిన ‘షాక్, ఠాగూర్, మాస్, చంద్రముఖి’ వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటాయి. ‘చంద్రముఖి’ చిత్రం అనగానే జ్యోతిక పేరు గుర్తు వచ్చేలా అందులో నటించింది. ఈ మూవీలో అద్భుత నటనతో ఎన్నో ప్రసంశలు అందుకుంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్యని 2006లో వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి మూవీస్‌కి కొంత బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె తాజాగా ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’. ఇది ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?
ఈ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ.. సినీ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ నిరాశ చెందలేదని తెలిపింది. సినిమాలు చేసుకుంటూ ఎదుగుతూనే వచ్చానని చెప్పింది. మంచి రోల్స్ సెలక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని, తాను చేసే పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నానని చెప్పింది. ఇలా చేసుకుంటూ పోవడం అంటే నటిగా ఎదుగుతున్నా అనే అర్థం అని తెలిపింది. ఇక ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. స్టోరీ బాగా నచ్చిందని, ప్రతి అంశం ఎట్రాక్ట్ చేసిందని అన్నారు. షబానా అజ్మీ వంటి గ్రేట్ పర్సన్‌తో చేయడం ఆనందంగా ఉందని, ఆమె తన పక్కన నిలబడితే ఏదో సరికొత్త ఎనర్జీ వచ్చినట్లు ఉంటుందని అన్నారు. గొప్ప యాక్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మెమొరబుల్ మూమెంట్ అని పేర్కొంది.

ఇక ఎన్నో కొత్త రకమైన రోల్స్ చేశానని, అందులో ‘మోజి’ సినిమాలోని పాత్ర అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇందులో మూగ, చెవిటి అమ్మాయిగా యాక్ట్ చేసింది జ్యోతిక. అలాగే న్యాయవాదిగా, ప్రిన్సిపల్‌గా చేసిన మూవీస్ కెరీర్‌లో ఐకానిక్ సినిమాలు అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో తొలి చిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని చెప్పింది. అయితే ఆ మూవీ విజయం సాధించకపోవడంతో తర్వాత ఆఫర్లు రాలేదని చెప్పుకొచ్చింది. దీంతో తమిళ మూవీస్ వైపు మొగ్గుచూపడంతో తొలి సినిమానే తన భర్త సూర్యతో చేశానని, ఇక అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయని తెలిపింది. సౌత్ ఇండియాలో ఎన్నో సినిమాలు గుర్తింపు తీసుకొచ్చాయని.. ఒకవేళ బాలీవుడ్‌లో సెటిలై ఉంటే, ఆ మంచి మంచి పాత్రలు అన్ని చేయకపోయే దానినని చెప్పుకొచ్చింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత హిందీలో ఛాన్స్ వచ్చిందని, ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉందని తెలిపింది.