Bhairavi
ఎంటర్‌టైన్మెంట్

New Heroine: టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ బ్యూటీ ఎంట్రీ! ఎవరో తెలుసా?

New Heroine: వెండితెర ఎప్పటికప్పుడు కొత్త అందాన్ని ఆహ్వానిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో నూతన హీరోయిన్లకు కొదవలేదు. కొత్త వచ్చిన వారంతా కొంతకాలానికి పాతబడిపోయి అవకాశాలు రాకపోవడంతో, మ్యారేజ్ చేసుకోవడమో, లేదంటే ఇతర ఇండస్ట్రీలకు వెళ్లిపోవడమో జరుగుతూ ఉంటుంది. మళ్లీ కొత్త వారితో ట్రెండ్ మొదలవుతూనే ఉంటుంది. అలా ఇప్పుడు టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ బ్యూటీ పరిచయం కాబోతోంది. అందం, అభినయం కలగలిపిన ఈ బ్యూటీ పేరు భైరవి. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?

‘సర్కార్ నౌకరి’ ఫేమ్, సింగర్ సునీత తనయుడు (Singer Sunitha Son) ఆకాష్ హీరోగా నటిస్తున్న సినిమాతో భైరవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. తధాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌ ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపుదిద్దుకుంటోన్న మూవీతో తన సత్తా చాటేందుకు భైరవి సిద్ధమైంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ సెట్స్‌లో భైరవి (Bhairavi) ప్రతిభ చూసిన వారంతా, టాలీవుడ్‌లో మరో అందమైన నటి వచ్చేసిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారంటే, ఎంతగా ఆమె తన స్కిల్స్‌లో ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

New Heroine Bhairavi
New Heroine Bhairavi

సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉందని, సినిమా విడుదల తర్వాత భైరవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమనేలా మేకర్స్ చెబుతున్నారు. సీనియ‌ర్ న‌టీన‌టులు రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా శివ వరప్రసాద్ ద‌ర్శ‌క‌త్వంలో తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

Heroine Bhairavi
Heroine Bhairavi

ఈ సంద‌ర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ చిత్ర విశేషాలను తెలుపుతూ.. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోన్న రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్ ఆకాష్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాతో హీరోయిన్‌గా భైరవిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ఆమె పర్ఫెక్ట్‌గా సెట్టయింది. హీరోకి మ‌ర‌ద‌లు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉండబోతోంది. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ప్ర‌స్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్, విడుద‌ల తేదీలను ప్ర‌క‌టిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి:
Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు