Rashmika Mandanna
ఎంటర్‌టైన్మెంట్

Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?

Rashmika Mandanna: ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో రష్మికా మందన్నా ఎంట్రీ ఇచ్చింది. హీరో నాగశౌర్య, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ఛాన్స్‌లు అందిపుచ్చుకుంది. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, వారసుడు’ ఇలా వరుస సినిమాలలో యాక్ట్ చేసింది. ఇక ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. నేషనల్ క్రష్‌గా ఈ అమ్మడిని పిలవడం మొదలు పెట్టారు. ఈ క్రేజ్‌తో అటు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘యానిమల్’ (Animal) సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప-2’ (Pushpa 2) మూవీతో నేషనల్ క్రష్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే తాజా బాలీవుడ్ హిట్ ‘చావా’లోనే ఆమెనే హీరోయిన్. ఇలా హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోన్న ఈ భామ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది. అటు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ ఉంటూ పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది.

Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?

తాజాగా తనకున్న ఓ వింత అలవాటుని బయటపెట్టింది రష్మిక. అదేంటంటే.. ఉదయం 4 గంటలకే లేచి ఫుడ్ తింటానని చెప్పింది. ఆమె చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా సెలెబ్రిటీల విషయంలో డైట్ గురించి వింటూ ఉంటాం. అది ఫాలో అవుతాం.. ఇది ఫాలో అవుతాం అంటూ ఉంటారు. స్లిమ్‌గా ఉండటానికి ఆ ఫుడ్.. ఈ ఫుడ్ తింటూ ఉంటామని చెబుతూ ఉంటారు. స్లిమ్‌గా ఉండడానికి వర్కౌట్స్ చేస్తూ సన్నగా కనపడుతూ ఉంటారు. అయితే నేషనల్ క్రష్ మాత్రం ఉదయం 4 గంటలకు ఫుడ్ తింటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ తిండి తినడానికి కూడా టైమ్ ఉండదు. రాత్రి, పగలు అని తేడా లేకుండా షూటింగ్స్‌కి అటెండ్ అవుతూ ఉంటారు. డైట్ మెయింటైన్ చేయడం కష్టమే. అయితే రష్మికా మందన్నా మాత్రం ఉదయమే 4 గంటలకు మ్యాగీ తింటున్న ఫోటో షేర్ చేసింది. ఇలా ఉదయాన్నే స్నాక్స్ లేదా చిరు తిండి లాగిస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. అంతే, అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను నెట్‌లో షేర్ చేస్తూ, అదేం పని, ఆ వింత అలవాటు ఏంటి? ఆ టైమ్‌లో తిండి తినడమేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక నటించిన హిందీ చిత్రం ‘చావా’ చిత్రం మరోసారి ఆమె గురించి బాలీవుడ్ మాట్లాడుకునేలా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:
Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు