Brahmanda: శ్రీమతి మమత సమర్పణలో, మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమని (Aamani) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్, దాసరి మమత నిర్మిస్తున్నారు. జయరామ్, కొమరం బన్నీ రాజ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు వంటివారు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్ర టీజర్‌ని ‘తండేల్’ (Thandel) దర్శకుడు చందూ మొండేటి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) మాట్లాడుతూ.. నా సినిమా ‘తండేల్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, డిజైన్స్ అన్నీ చూశాను. అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టే బ్రహ్మాండంగా ఆడాలని కోరుతూ.. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
Also Read- Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?
టీజర్ విడుదల చేసిన చందూ మొండేటికి నిర్మాతలు దాసరి సురేష్, మమత ధన్యవాదాలు తెలిపారు. చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ ఆవిష్కరించిన దర్శకుడు చందూ మొండేటికి థ్యాంక్స్. ఆయన ఈ టీజర్ విడుదల చేయడాన్ని మేమంతా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాము. మొట్ట మొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రూపొందుతోన్న చిత్రమిది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఈ పదం కేవలం తెలంగాణ (Telangana) ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. ఇందులో యాక్షన్, డివోషనల్ అంశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు.

చిత్ర హీరో బన్నీ రాజు మాట్లాడుతూ.. నేను హీరోగా చేసిన సినిమా టీజర్‌ని దర్శకుడు చందూ మొండేటి రిలీజ్ చేయడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ ‘బ్రహ్మాండ’ సినిమా కూడా ‘తండేల్’లా విజయం సాధించాలని, ప్రేక్షక దేవుళ్లు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. టీజర్ విడుదల పట్ల సినిమాటోగ్రాఫర్ కాసుల కార్తీక్ సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, ఛత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్, అనంత్ కిషోర్ దాస్, ఐడ్ల మధుసూదన్ రెడ్డి, మీసం సురేష్, దేవి శ్రీ వంటివారు ఇతర పాత్రలలో నటించారు.